లీలా థామ‌స్ తెలుగులో అద‌ర‌గొట్టేసిందా?

Update: 2022-05-25 02:30 GMT
త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది మ‌ల‌యాళ బ్యూటీ న‌జ్రియా న‌జీమ్‌. `రాజా - రాణి` మూవీతో త‌మిళ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌కరించిన న‌జ్రియా ఇదే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. ఆర్య -న‌య‌న‌తార ఇందులో జంట‌గా న‌టించారు. సినిమాలో న‌జ్రియా కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించింది.  హీరో ఆర్య ప్రేమించిన యువ‌తిగా క‌నిపించి మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఇప్ప‌డు తెలుగులో `అంటే సుంద‌రానికి` చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది.

న‌జ్రియా తెలుగులో న‌టించిన తొలి చిత్రఇది. నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించాడు. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ మూవీ తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో మాత్ర‌మే విడుద‌ల కాబోతోంది. జూన్ 10న మూడు భాష‌ల్లో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న న‌జ్రియా న‌జీమ్ త‌న పాత్ర‌కు తానే డబ్బింగ్ చేసుకోవ‌డం విశేషం.

తెలుగులో త‌న‌కిది తొలి సినిమా కావ‌డంతో తెలుగులో డ‌బ్బింగ్ చెప్పి త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటోంది న‌జ్రియా. మంగ‌ళ‌వారం చిత్ర బృందం న‌జ్రియా త‌డ‌బ‌డుతూ ఇబ్బంది ప‌డుతూ తెలుగు డ‌బ్బింగ్ చెబుతున్న వీడియోని మేక‌ర్స్ విడుద‌ల చేశారు. 28 సెకండ్ల వీడియోలో తెలుగు డైలాగ్ లు చెబుతూ కుస్తీ ప‌డుతూ న‌జ్రియా క‌నిపించింది. త‌న‌కిది క‌ష్ట‌మే అయినా తెలుగులో డ‌బ్బింగ్ చెప్ప‌డానికి ఏమాత్రం వెన‌క‌డుగు వేయ‌క‌పోవ‌డం విశేషం.

డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ తో త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పుకునే వీలున్నా ఆ ప్ర‌య‌త్నం చేయ‌కుండా క‌ష్ట‌మైనా స‌రే న‌జ్రియా తెలుగు డ‌బ్బింగ్ చెప్పుకున్న తీరు ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది. చిన్న చిన్న స‌న్నివేశాల‌కు, చిన్న చిన్న సౌండ్స్ ఇస్తూ న‌జ్రియా త‌న క్యూట్ నెస్ తో ఎట్రాక్ట్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. `అంటే సుంద‌రానికి` మూవీలో న‌జ్రియా లీలా థామ‌స్‌గా క్రిస్టియ‌న్ యువ‌తిగా క‌నిపించ‌బోతోంది.

బ్రాహ్మ‌ణ యువ‌కుడిగా నాని న‌టించారు. రీసెంట్ గా విడుద‌ల చేసిన టీజ‌ర్ లో ఇద్ద‌రి మ‌ధ్య మంచి కెమిస్ట్రీ  అద్భుతంగా కుదిరి సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ ని రిలీజ్ చేయ‌బోతున్న ఈ మూవీ ని జూన్ 10న విడుద‌ల చేస్తున్నారు. 

https://twitter.com/MythriOfficial/status/1529060136353865733?cxt=HHwWioCpufeFqLgqAAAA
Tags:    

Similar News