సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో కాకముందు ‘కొడుకు దిద్దిన కాపురం’ - ‘ముగ్గురు కొడుకులు’ ‘గూఢాచారి 117’ వంటి సినిమాలలో బాలనటుడుగా చేశాడు. ఇవి అన్నీ కూడా వాళ్ళ నాన్న సూపర్ స్టార్ కృష్ణ సినిమాలే అనుకోండి. చదువు పూర్తి అయిన తరువాత హీరో గా మారిన మహేశ్ తొలి సినిమాలు లలో కూడా కృష్ణ గారు ‘రాజకుమారుడు’ - ‘వంశీ’ - ‘టక్కరి దొంగ’ చిత్రాల్లో అతిథి పాత్రల్లో నటించారు. ఇలా జరిగి చాలకాలం గడిచింది ఇప్పుడు మహేశ్ సూపర్ స్టార్ అయ్యాడు. ఇలా కొడుకును తండ్రిని ఒకేసారి తెరపై చూడాలి అనుకునే అభిమానులు కోరిక మహేశ్ బాబు కొత్త సినిమా ‘భరత్ అనే నేను’తో తీరబోతుంది.
కథ కుదరక పోవడం వలనో లేక మరే ఇతర కారణాల వలనో కృష్ణ గారు నటన నుండి పూర్తిగా దూరమైయ్యారు. ఇప్పుడు మళ్ళీ మహేశ్ బాబు సినిమాలో ఒక అతిధి పాత్రలో కనిపించనున్నారు అని చెబుతున్నారు. ఇంకా ఎటువంటి అధికారక ప్రకటన ఇవ్వకపోయినా దాదాపుగా ఒక అనుభవం ఉన్న రాజకీయ నాయకుడుగా ఈ సినిమాలో నటించబోతున్నారు అని తెలుస్తుంది. సూపర్ కృష్ణ మాత్రమే కాకుండా ఈ సినిమాలో తమిళ్ హీరో శరత్ కుమార్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. రాజీకియా కథాంశంతో రాబోతున్న ఈ సినిమా లో మహేశ్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాలో నటించడం అనేది జరిగితే మళ్ళీ 18 ఏళ్ళు తరువాత తండ్రిని కొడుకుని ఒకేసారి చూసే అవకాశం అభిమానాలుకు దొరికినట్లే అని చెప్పవచ్చు.
కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న భరత్ అనే నేను సినిమాలో మహేశ్ బాబుకి జోడీగా కియారా అద్వాని నటిస్తుంది. డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్స్ ప్రొడక్షన్ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సినిమాకు సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పుడు అనుకున్న ప్రణాళిక ప్రకారం వేగంగానే నడుస్తుంది. మరో తాజా చిత్రం మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ‘స్పైడర్’ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. భరత్ అనే నేను సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాగా రాబోతుంది.