తమిళ్ లో ఉన్న స్టార్ హీరోలందరు దాదాపు తెలుగు జనాలకు పరిచయం అయ్యారు. కొందరైతే ఇక్కడి స్టార్ హీరోస్ కి ఉన్న మార్కెట్ ను సెట్ చేసుకున్నారు. రజినీకాంత్ - కమల్ వంటి వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సూర్య -కార్తీ ఇక్కడ వారికంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సెట్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు తెలుగు వారు గర్వపడేలా అక్కడ కూడా మనోడు ఒక్కడు ఉన్నాడు రా అనేట్లు ఫీల్ అవుతున్నారు. మహేష్ బాబు స్పైడర్ సినిమాతో కోలీవుడ్ లో కూడా భారీ స్థాయిలో డైరెక్ట్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.
అయితే రీసెంట్ గా అక్కడ ఆడియో రిలీజ్ చేసిన మహేష్ కి ఊహించని విధంగా ఆదరణ లభించింది. దీంతో మహేష్ సౌత్ లో మరో సూపర్ స్టార్ అవుతాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక నిన్న హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ని గ్రాండ్ గా చేసిన చిత్ర యూనిట్ ప్రముఖ దర్శకులతో పాటు కృష్ణ ని కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృష్ణ కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. సినిమాల్లో నటించడానికి మద్రాసు వెళ్లినప్పుడు మొదటి ఛాన్స్ నాకు తమిళ సినిమాలోనే వచ్చింది. కానీ నాకు తమిళ్ రాకపోవడంతో ఆ అవకాశం మిస్ అయ్యిందని చెప్పారు. ఇక ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారు ‘తేనె మనసులు’ అనే చిత్రంతో నన్ను పరిచయం చేశారని చెబుతూ... 350కు పైగా చిత్రాల్లో నటించిన నన్ను అభిమానులు ఎంతగానో ఆదరించారని చెప్పారు.
ఇక ‘స్పైడర్’ ట్రైలర్ చాలా బావుందని మహేష్‌బాబు చాలా బాగా తమిళం మాట్లాడారని తెలిపారు. ఇక దర్శకుడి గురించి మాట్లాడుతూ.. మంచి దర్శకుడైన మురగదాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు తమిళంలో పరిచయం కావడం చాలా సంతోషంగా ఉందని కృష్ణ స్పీచ్ ని ముగించారు.