సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మే 12న వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సర్కారు వారి..' రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. ప్రమోషన్స్ చేయడం లేదని అభిమానులు నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెగిటివ్ హ్యాష్ ట్యాగ్ తో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ట్రెండ్ చేస్తున్నారు.
ఇది చాలదన్నట్లు ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఏదొక విషయం లీక్ అవుతుండటం మేకర్స్ కు తలనొప్పిగా మారింది. SVP సినిమా షూటింగ్ చివరి చేరుకున్నా లీకుల బెడద మాత్రం తప్పడం లేదు. తాజాగా సెట్స్ లోని మహేష్ పిక్ ఒకటి లీక్ కాబడి, నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఒక సాంగ్ మినహా 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. దీని కోసం ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఓ మాసివ్ సెట్ ను రెడీ చేసినట్లు సమాచారం.
ఇప్పటికే సెట్ లోని BTS ఫోటోలను మేకర్స్ రిలీజ్ చేయగా.. మహేష్ మోకాలి కిందకు కర్చీఫ్ కట్టుకొని కనిపించడంతో ఇదొక మాస్ పాట అని అర్థం అవుతోంది. అయితే తాజాగా సూపర్ స్టార్ ఫుల్ ఫోటో బయటకు వచ్చింది. కలర్ ఫుల్ డ్రెస్సులో మహేష్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు.
ఇకపోతే ఎస్ ఎస్ థమన్ కంపోజ్ చేసిన ఈ డ్యాన్స్ నంబర్ మహేష్ బాబు పేరుతోనే ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతోంది. 'మా.. మా.. మహేశూ..' అనే లిరిక్స్ తో సాగే ఈ మాస్ సాంగ్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వబోతోందని అంటున్నారు. 'మైండ్ బ్లాక్' రేంజ్ లో మహేష్ స్టెప్పులు మెస్మరైజ్ చేయనున్నట్టు చెబుతున్నారు.
ప్రధాన జంట మహేష్ బాబు - కీర్తి సురేష్ లపై షూట్ చేస్తున్న ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సాంగ్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
ఇప్పటికే 'సర్కారు వారి పాట' ప్రమోషనల్ కంటెంట్ కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. 'కళావతి' 'పెన్నీ' పాటలు సోషల్ మీడియాను షేక్ చేయగా.. టైటిల్ సాంగ్ ను మేకర్స్ ఏప్రిల్ 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవీన్ యెర్నేని - వై. రవిశంకర్ - రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట నిర్మాతలు. ఆర్. మది సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.