తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వీరాభిమాని అయిన మురళి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఇటీవల ఆయన రజినీకాంత్ కు మీ సారధ్యంలో నడవాలని కోరుకున్నాను. కాని నడవలేక పోతున్నందుకు బాధగా ఉంది అంటూ తన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాడు. అది కాస్త వైరల్ అయ్యి ఏకంగా రజినీకాంత్ స్పందించాడు. మురళికి స్వయంగా తన వాయిస్ మెసేజ్ ను పంపించడం ద్వారా ఆయనలో మనో ధైర్యంను నింపడంతో పాటు బతుకుపై ఆశను కలిగించాడు.
రజినీ తన వాయిస్ మెసేజ్ లో.. నీకేం కాదు ధైర్యంగా ఉండు. నీ ఆరోగ్యం త్వరగా కుదుట పడుతుంది. నీవు పూర్తి ఆరోగ్యవంతుడివి అయిన తర్వాత కుటుంబంతో మా ఇంటికి రండి నేను నిన్ను కలవాలని అనుకుంటున్నాను అంటూ కొండంత ధైర్యంను జీవితంపై ఆశను రజినీకాంత్ మురళికి కల్పించాడు. రజినీకాంత్ వాయిస్ మెసేజ్ తో ఖచ్చితంగా మురళి కోలుకుంటాడని కరోనాను జయించి బతికి బట్ట కడుతాడంటూ చాలా నమ్మకంను ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అభిమానులకు మనో ధైర్యంను కల్పించేలా హీరోలు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.