ప్రియా వారియ‌ర్ కు సుప్రీంలో ఊర‌ట‌!

Update: 2018-02-21 08:06 GMT
ఒక్క కంటి చూపుతోనే యావత్ భార‌త‌దేశాన్ని త‌న‌వైపుకు తిప్పుకున్న కేర‌ళ కుట్టి ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ఓవ‌ర్ నైట్ లో సెల‌బ్రిటీ అయిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు రికార్డు స్థాయిలో ఆ పాట‌ను దాదాపు 3 కోట్ల న‌ల‌భై ల‌క్ష‌ల(3.4 మిలియ‌న్) మంది వీక్షించారు. తాజాగా - ఈ టీనేజీ క్యూట్ గ‌ర్ల్ ....ట్విట్ట‌ర్ లో ఫేస్ బుక్ వ్య‌వ‌స్థాప‌కుడు మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ ను బీట్ చేసింది. ట్విట్ట‌ర్లో జుక‌ర్ బ‌ర్గ్ కు 4 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లుండ‌గా - లేటెస్ట్ సెన్సేష‌న్ ప్రియాకు 4.6 మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్లుండ‌డం విశేషం. అయితే, ప్రియా పాపులారిటీకి తోడు ఆమెకు కొత్త‌ చిక్కులు వ‌చ్చిప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్రియా వింక్ సాంగ్....`మాణిక్య మ‌ల‌యార పూవి`.... ముస్లింల మ‌నోభావాలు దెబ్బ‌తీసింద‌ని ఆమెపై, ఆ చిత్ర ద‌ర్శ‌కుడు ఒమ‌ర్ లులు - నిర్మాత‌పై ప‌లు కేసులు న‌మోద‌య్యాయి.

హైద‌రాబాద్ లోని కొంద‌రు ముస్లింలు - ముంబైలోని ర‌జా అకాడ‌మీ - మ‌హారాష్ట్ర‌ల‌లో జ‌న‌జాగ‌ర‌ణ స‌మితిలు ....కేసు పెట్టారు. దీంతో, ప్రియా ఆ కేసులపై స్టే విధించాల‌ని సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది. ప్రియా పిటిష‌న్ ను విచార‌ణ జ‌రిపిన సుప్రీం కోర్టు....ఆ కేసుల‌పై స్టే విధించింది. దీంతో ఆమెకు ఊర‌ట ల‌భించింది. తనపై క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలన్న ప్రియా అభ్య‌ర్థ‌న‌ను సుప్రీం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది. దీంతో, తెలంగాణ - మహారాష్ట్రలో నమోదైన కేసులపై స్టే విధిస్తూ...ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా, ప్రియా - లులు - నిర్మాత‌ల‌పై దేశవ్యాప్తంగా ఎక్కడా కేసులు నమోదు చేయవద్దని కోర్టు ఆదేశించింది.
Tags:    

Similar News