సుప్రీమ్.. ఈ ఏడాది ఇప్పటివరకూ రిలీజ్ అయిన సినిమాల్లో ఎవరూ ఊహించని, అంచనా వేయని స్థాయిలో విజయం సాధించిన మూవీ ఇది. అలాగే సుప్రీమ్ సాయిధరం తేజ్ రేంజ్ ని మరింతగా పెంచి.. పాతిక కోట్ల హీరోగా నిలబెట్టింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ.. యావరేజ్ టాక్ తో మొదలై.. సూపర్ హిట్ కంటే రేంజ్ కి చేరిపోయింది. ఇప్పటికే 25 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ.. శుక్రవారం కాకుండా గురువారమే రిలీజ్ కావడం.. 50 రోజుల మార్క్ ని అందుకునేందుకు ఉపయోగపడింది.
సుప్రీమ్ కి ఇప్పుడు దాదాపు అన్ని ఏరియాల్లో బిజినెస్ దాదాపు క్లోజ్ అయిపోయింది. మిగిలిన ఒకటీ అరా థియేటర్ల నుంచి పెద్దగా వసూలయ్యే ఛాన్స్ లేదు. ఈ 50 రోజుల్లో సుప్రీమ్ 25కోట్ల రూపాయల పై చిలుకు రాబట్టేశాడు. నైజాంలో 8.52 కోట్లు - సీడెడ్ 3.51కోట్లు - నెల్లూరు 0.75 కోట్లు - కృష్ణా 1.40 కోట్లు - గుంటూరు 2.02 కోట్లు - వైజాగ్ 3 కోట్లు - ఈస్ట్ 1.92 కోట్లు - వెస్ట్ 1.40 కోట్లు వసూలయ్యాయి.
మొత్తంగా ఏపీ - తెలంగాణల్లోనే 22.52 కోట్లు కొల్లగొట్టిన సుప్రీమ్.. కర్నాటక - రెస్టాఫ్ ఇండియా - ఓవర్సీస్ లలో కలిపి 2.55 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ మొత్తం కలిపితే 25.07 కోట్లను సుప్రీమ్ థియేటర్ల నుంచి వసూలు చేయగలిగింది. సాయిధరం తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాతిక కోట్ల మార్క్ ను రీచ్ కావడంతో.. ఈ మెగా హీరో రేంజ్ మరో మెట్టు పెరిగిపోయింది.