ఒక సూపర్ హిట్.. ఒక పెద్ద ఫ్లాప్ తీయడం సురేందర్ రెడ్డి కెరీర్లో ఆనవాయితీగా వస్తోంది. ‘రేసుగుర్రం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘కిక్-2’తో చేదు గుళిక తిన్న సురేందర్.. ఇప్పుడు ‘ధృవ’తో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. అతడి తర్వాతి సినిమా ఏదన్న విషయంలో సస్పెన్స్ నడుస్తోంది. ‘ధృవ’ ప్రమోషన్లలో భాగంగా మీడియా వాళ్లను కలిసి సురేందర్.. చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నట్లు వెల్లడించాడు. అది ఎప్పుడన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఐతే సురేందర్ తర్వాతి సినిమా మాత్రం అది కాదు. అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో సురేందర్ నెక్స్ట్ మూవీ చేయబోతున్నట్లు వెల్లడైంది.
ఓ ఇంటర్వ్యూలో ఇంతకుముందు ‘100 పర్సంట్ లవ్’ తర్వాత అక్కినేని నాగచైతన్యతో సినిమా చేయాలనుకున్నారు కదా అని సురేందర్ వద్ద ప్రస్తావించగా.. అఖిల్ సినిమా సంగతి వెల్లడించాడు. ‘‘అవును. 100 పర్సంట్ లవ్ తర్వాత చైతన్యతో సినిమా చేయాలనుకున్నాను. అప్పటి నుంచి చైతన్యతో టచ్ లోనే ఉన్నాను. కచ్చితంగా చైతన్యతో సినిమా చేస్తాను. అంతకంటే ముందు అఖిల్ తో సినిమా చేస్తున్నాను’’ అని తెలిపాడు. అఖిల్-సురేందర్ కాంబినేషన్ గురించి గతంలోనూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అఖిల్.. ‘మనం’ దర్శకుడు విక్రమ్ కుమార్ తో తన రెండో సినిమా చేయబోతున్నాడు. అది పూర్తయ్యాక వచ్చే ఏడాది వేసవిలో సురేందర్ సినిమా చేసే అవకాశముంది. ఐతే తన ఆస్థాన రచయిత వక్కంతం వంశీ వేరు కుంపటి పెట్టుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు కథ సురేందరే రాస్తాడా.. ఇంకెవరినైనా ఆశ్రయిస్తాడా అన్నది చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/