వీధి బాలలతో సురేందర్‌రెడ్డి సినిమా?

Update: 2015-07-12 00:20 GMT
ఈ మధ్యనే రేసుగుర్రం చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు సురేందర్‌రెడ్డి. దర్శకుడిగా వందకి 100 మార్కులు వేయించుకున్నాడు ఆ సినిమాతో. ఆ తర్వాత రవితేజ హీరోగా 'కిక్‌ 2' చిత్రీకరణలో బిజీ అయిపోయాడు. ఇప్పుడు ఆ సినిమా కూడా పూర్తయింది. కళ్యాణ్‌రామ్‌ నిర్మించిన కిక్‌ 2 బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు తెస్తుందన్న అంచనాలున్నాయి.

అయితే ఈ సినిమా తర్వాత సురేందర్‌ రెడ్డి మెగా హీరో చరణ్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే అంతకంటే ముందే ఓ చిన్న సినిమాని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారని సమాచారం. చరణ్‌ ఇప్పటికే బిజీగా ఉన్నాడు కాబట్టి అతడు అందుబాటులోకి వచ్చేటప్పటికి ఈ ప్రయోగానికి కిక్కిచ్చే డైరక్టర్‌ రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. తమిళంలో ఘనవిజయం సాధించిన 'గోలి సోడా' చిత్రానికి మనోడు దర్శకత్వం వహిస్తాడని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్‌ రీమేక్‌ చేయనున్నారు. ఇప్పటికే తమిళ వెర్షన్‌ హక్కుల్ని కొనేశారట.

ఓ నలుగురు వీధి బాలలు అంచెలంచెలుగా ఎదిగి టాప్‌ పొజిషన్‌కి ఎలా చేరుకున్నారన్నదే కథాంశం. ఇందులో ఓ అనాధ బాలుడి పాత్రలో లగడపాటి తనయుడు నటించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్‌ న్యూస్‌ బయటకొచ్చే ఛాన్సుంది.
Tags:    

Similar News