స్ట్రెయిట్ గా కథను రెడీ చేసి వినిపించినా సదరు అగ్ర నిర్మాత చెవికి ఎక్కదట. ఒకవేళ కథ బావున్నా.. దానిని ఎలా తెరకెక్కిస్తారోనన్న సందేహం.. పైగా హిట్టు కొట్టేవరకూ కొడుతుందా లేదా? అన్న డౌట్. అందుకే ఆయన స్ట్రెయిట్ కథలకు ఓకే చెప్పరు. పైగా స్ట్రెయిట్ డైరెక్టర్ కి ఓకే చెప్పడానికి ఇష్టపడరు. అంతేకాదు.. ఆయనకు ఒక ఫార్ములా ఉంది. తనకంటూ ఒక హిట్టు స్ట్రాటజీ ఉంది. దానిని మాత్రమే ఫాలో చేస్తారు. ఇదంతా ఎవరి గురించి? అంటే.. అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు గురించే.
గత కొన్నేళ్లుగా సదరు నిర్మాత సరికొత్త స్ట్రాటజీని అనుసరిస్తున్నారు. సొంత కథల్ని నమ్మే కంటే పొరుగు భాషలో విజయం సాధించిన వాటినే రీమేక్ చేసి సక్సెస్ అందుకుంటున్నారు. దీనివల్ల బోలెడంత సమయం ఆదా అవుతోంది. డబ్బు మిగులుతోందట. కొత్త తరం దర్శకులు వినిపించే కొత్త కథలు వినడం.. అవి నచ్చకపోవడం.. నచ్చినా బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉంటుందోనన్న డైలమా.. వెరసి ఇదంతా నాకెందుకు అనుకున్నారట. దీంతో స్ట్రెయిట్ కథల కంటే... సక్సెస్ అయిన స్టోరీలైతేనే బెటర్ అని రీమేక్ లపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.
2019లో కొరియన్ మూవీ మిస్ గ్రానీని ఓ బేబి పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టారు. తాజాగా మరో కొరియన్ హిట్టు చిత్రాన్ని లాక్ చేసారు. కొరియన్ మూవీ `మిడ్ నైట్ రన్నర్స్` రీమేక్ హక్కులను చేజిక్కించుకుని యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మకు రీమేక్ బాధ్యతలు అప్పజెప్పారు. ఈ సినిమాని రీమేక్ చేయమని పలువురికి అవకాశాలిచ్చినా ఎవరూ ఆ సాహసం చేయలేదట. చివరికి సుధీర్ వర్మ ఫైనల్ అయ్యాడు. నవతరంలో ఎలాంటి స్క్రిప్టును అయినా డీల్ చేసే సత్తా సుధీర్ కి ఉందని బాబు నమ్మారట. చివరికి ఆ యంగ్ డైరెక్టర్ నే ఓకే చేశారు. అయితే ఈలోగానే మరో కొరియన్ మూవీని చేజిక్కించుకుని ఇప్పుడు మరో దర్శకుడి కోసం వెతుకుతున్నారట. ఇది కూడా సుధీర్ వర్మకే అప్పజెబుతారా? అంటే ప్రస్తుతానికి సమాధానం లేదు. మరో దర్శకుడిని ఫైనల్ చేసేస్తే ఈ రెండో రీమేక్ ని పట్టాలెక్కించే వీలుందట. మరి జాక్ పాట్ ఎవరికి తగుల్తుందో వేచి చూడాలి.