ఒక స్పెషల్ అకేషన్ వచ్చినపుడు అప్పటికి నిర్మాణంలో ఉన్న సినిమాల పోస్టర్లు - వీడియోలతో సందడి చేయడం ఈ మధ్య బాగా ఎక్కువైంది. జనవరి 1కి, సంక్రాంతికి ఇలా బోలెడన్ని సినిమాల హంగామా సాగింది. ఇక ఈ నెలలో ‘వేలంటైన్స్ డే’ లాంటి స్పెషల్ అకేషన్ వచ్చింది. దీంతో ఫిల్మ్ మేకర్స్ అంతా తమ తమ స్థాయిలో సందడి చేశారు. ఐతే ప్రేమికుల రోజున అందరినీ వెనక్కి నెట్టి టాప్ పొజిషన్ లో నిలిచింది మాత్రం ‘24’ టీమే అని చెప్పాలి. సూర్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచి ఆసక్తి రేపుతూనే ఉంది. ఆ మధ్య రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా వేలంటైన్స్ డే సందర్భంగా రెండు పోస్టర్లు వదిలాడు నిర్మాత సూర్య. అవి సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. రెండు పోస్టర్లలో చాలా వైవిధ్యంగా కనిపిస్తున్నాడు సూర్య. ఒకదాంట్లో సమంతతో కలిసి బైక్ మీద వెళ్తుంటే.. ఇంకోదాంట్లో నిత్యా మీనన్ ను దగ్గరికి తీసుకుంటూ కనిపించాడు. సూర్య అవతారం కానీ.. పోస్టర్ల డిజైన్స్ కానీ సూపర్బ్ అనిపిస్తున్నాయి. సినిమా మీద ఇప్పటికే జనాల్లో విపరీతమైన ఆసక్తి ఉండగా.. ఈ పోస్టర్లు ఆ ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. టైమ్ మెషీన్లా పని చేసే ఓ వాచ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం. సూర్య మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఇందులో ఒకటి నెగెటివ్ క్యారెక్టర్ అని సమాచారం. ఈ ఏడాది వేసవికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.