అమితాబ్ లానే బోకే పంపిన జంట‌

Update: 2019-08-10 09:16 GMT
త‌మిళ ఇండ‌స్ట్రీలో సూప‌ర్‌ స్టార్ ర‌జీనీకాంత్ త‌రువాత ఆ స్థాయి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో త‌ళా అజిత్. అత‌డు ఏ సినిమా చేసినా ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా వుండ‌దు. భారీ క‌టౌట్‌ లు.. పాలాభిషేకాలు ఒక‌టేమిటి త‌మ అభిమాన హీరో కోసం అభిమానులు బోలెడంత ర‌చ్చ చేస్తారు. ఆ ర‌చ్చ‌నే ఇప్పుడు ట్రెండ్ గా మారింది. త‌ళా తాజా చిత్రం కోసం ఇప్పుడు ఏకంగా స్టార్ క‌పుల్ రంగంలోకి దిగారు. సూర్య‌- జ్యోతిక జంట‌  `నేర్కొండ పార్వ్యై` చిత్రంపై ప్ర‌శంస‌లు కురిపించ‌డం హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్‌` ని నిర్మాత‌ బోనీక‌పూర్ త‌న భార్య శ్రీ‌దేవి కోరిక మేర‌కు అజిత్‌ తో త‌మిళంలో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. అజిత్- శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్‌-  విద్యాబాల‌న్‌- ఆండ్రియా తారియంగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. `ఖాకీ` ఫేమ్ హెచ్. వినోద్ రూపొందించిన ఈ త‌మిళ వెర్ష‌న్ హిందీ వెర్ష‌న్‌ని మించి తెర‌కెక్క‌డంతో తొలి రోజే 12 కోట్లు వ‌సూలు చేసింది. రెండు రోజుల‌కు గానూ 24 కోట్లు కొల్ల‌గొట్ట‌డం విశేషంగా చెబుతున్నారు.

అయితే ఈ సినిమాలో త‌ళా అజిత్ న‌ట‌న‌కు ఫిదా అయిన అభిమానులు ర‌చ్చ చేస్తున్నారు. అలాగే స్టార్ క‌పుల్ సూర్య‌, జ్యోతిక పూల బొకేను అజిత్ ఇంటికి పంపించడం ఆస‌క్తిక‌రంగా మారింది. ఓ స్టార్ హీరో న‌ట‌న‌ని ప్రసంశిస్తూ మ‌రో స్టార్ హీరో పూల బొకేను పంపించ‌డం అనేది చాలా అరుదు. అలాంటి దృశ్యం కోలీవుడ్ హీరోల మ‌ధ్య ఆవిషృతం కావ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది. తొలి రోజే ప్ర‌త్యేకంగా ఈ చిత్రాన్ని చూసిన సూర్య‌, జ్యోతిక జంట హీరో అజిత్ న‌ట‌న‌కు ముగ్ధులై పూల బొకేను పంపించి అమితాబ్ త‌ర‌హాలోనే కొత్త సాంప్ర‌దాయాన్ని మొద‌లు పెట్ట‌డం ఆస‌క్తిక‌రం.


Tags:    

Similar News