కోలీవుడ్ క్రియేటివ్ మేకర్ బాల సినిమా నుంచి సూర్య ఎగ్జిట్ అయి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కథలో మార్పులు..చేర్పులు చోటు చేసుకోవడం తో అనూహ్యంగా ఆ కథ కి సూర్య సెట్ అవ్వడం లేదని..మరో హీరోతో ఈ సినిమా చేస్తున్నట్లు బాల ప్రకటించి అందర్నీ నిరాశపరిచారు. శివపుత్రుడు కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందని సంతోషిస్తోన్న సమయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.
బాల నిర్ణయాన్నిసూర్య గౌరవించి బయటకు రావడం సంచలనంగా మారింది. అసలు సూర్య ఎగ్జిట్ అవ్వడానికి అలసు కారణం ఏంటి? బాల తప్పించారా? సూర్య కావాలనే తప్పుకుని ఇలాంటి ప్రకటన రిలీజ్ చేసాలా? ఇలా చాలా సందేహాలు అభిమానుల బుర్రల్ని తొలి చేస్తున్నాయి. ఈ నేపథ్యంతో తాజాగా సూర్య చెన్నైలో నిర్వహించిన ఓసమావేశంలో అభిమానులందరికీ ఓ సందేశాన్ని పాస్ చేసారు.
'వైఫల్యాలను చూసి నిరాశ చెందవద్దని ఆయన అభిమానులను కోరారు. మీరు కోరుకున్నది సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాను. మీరు నాపై ఉంచిన ప్రేమాభిమానానికి ఎప్పటికీ రుణపడే ఉంటాను. మీ అభిమానం గురించి మాటల్లో చెప్పలేనిది. చేతల్లో చూపించలేనిది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి అభిమానుల్ని సంపాదించుకోలేను' అని అన్నారు.
ప్రస్తుతం సూర్య చేతిలో రెండు సినిమాలున్నాయి. 'సిరుత్తై' శివతోఓ పిరియాడిక్ సినిమా చేస్తున్నారు. దీన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ అవుతుంది. ఇది సూర్య 42వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే సంచలన దర్శకుడు వెట్రిమారన్‌తో 'వాడివాసల్' అనే ప్రాజెక్ట్ ఒకటి లాక్ అయింది. ఈ కాంబోపై సినిమా అంటే అంచనాలు భారీగానే ఉంటాయి.
ఇలా సూర్య బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ ఫుల్ దర్శకులతోనే సినిమాలు చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ ఎంట్రీపై కూడా దృష్టి పెడుతు న్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ హీరోలంతా ఒక్కొక్కరుగా టాలీవుడ్ లో లాంచ్ అవుతున్నారు. విజయ్...ధనుష్ లాటి వాళ్లు ఇప్పటికే రెడీగా ఉన్నారు. కానీ వీళ్లిద్దరి కంటే సూర్య తెలుగులో ఎప్పుడో ఫేమస్ అయ్యారు. ఆయనిప్పుడు ఇక్కడ స్ర్టెయిట్ సినిమా చేస్తే ఓ తెలుగు నటుడే నటించినట్లు ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.