సూర్య గర్జన.. గణతంత్రం నాడే

Update: 2016-12-18 06:27 GMT
కోలీవుడ్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ఎస్3 పై అంచనాల సంగతేమో కానీ.. వాయిదాల పర్వం కొనసాగుతోంది. సింగం సిరీస్ లో మూడో భాగంగా వస్తున్న ఈ చిత్రాన్ని తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదల చేసేందుకు ప్లాన్ చేయగా.. డిసెంబర్ 23న ఈ మూవీ థియేటర్లలోకి రావాల్సింది. ఎక్స్ టర్నల్ రీజన్స్ అంటూ.. ఎస్3 వాయిదాపై సూర్య స్వయంగానే అనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు.

మరి ఈ చిత్రం విడుదల ఎప్పుడా అనే విషయంపై ఇప్పుడు ఓ క్లారిటీ వస్తోంది. సెన్సార్ పూర్తయినా యూ సర్టిఫికేట్ లభించకపోవడంతోనే వాయిదా పడ్డ ఈ మూవీని.. డిసెంబర్ 30న థియేటర్లలోకి తెస్తారని అన్నారు. కానీ రివిజన్ కమిటీకి పంపి.. ఈలోగా తిరిగి సర్టిఫై చేయించుకోవడం సాధ్యమయ్యే పని కాదు. ఆ తర్వాత వారం ప్రయత్నిద్దామంటే.. సంక్రాంతికి పెద్ద రేస్ ఉంది. తెలుగులో భారీ చిత్రాలతో ఇప్పటికే థియేటర్లు బ్లాక్ అయిపోయాయి. అటు తమిళ్ లో కూడా పొంగల్ కి పోటీ పీక్ స్టేజ్ లో ఉంటుంది.

లాస్ట్ మినిట్ లో రేస్ లో దూరి.. తెలుగు-తమిళ రాష్ట్రాల్లో థియేటర్లు సంపాదించడం అసాధ్యం. అందుకే ఈ మూవీని ఏకంగా 2017 గణతంత్ర దినోత్సవం నాటికి పోస్ట్ పోన్ చేసేశారట. ఆ రోజుకు తమిళ్ లో ఏ చిత్రం షెడ్యూల్ చేసి లేదు. ఇటు తెలుగులో కూడా వెంకటేష్ గురు తప్ప మరే సినిమాను విడుదల చేస్తామని చెప్పలేదు. కాబట్టి.. ఆ డేట్ కి అయితే.. ఎలాంటి రిస్క్ లేకుండా థియేటర్స్ దొరుకుతాయని డిసైడ్ అయ్యారట ఎస్3 యూనిట్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News