వివాదం వేళ‌ భార్య‌కు అండ‌గా స్టార్ హీరో!

Update: 2020-04-29 04:00 GMT
దేవాల‌యాల‌కు ఇచ్చిన‌ట్టే పాఠ‌శాల‌లు.. ఆస్ప‌త్రుల‌కు డొనేష‌న్లు ఎందుకు ఇవ్వ‌రు? అలా ఇస్తే మ‌రీ ఇంత పాత‌బ‌డిన భ‌వంతుల్లో స్కూల్స్.. ఆస్ప‌త్రుల్ని చూడాల్సిన క‌ర్మ ఏమిటి? అని సూటిగా ప్ర‌శ్నించారు క‌థానాయిక జ్యోతిక‌. చాలా కాలం క్రితం ఓ అవార్డు కార్యక్రమంలో జ్యోతిక చేసిన కామెంట్లు ఇవి. ప్రజలు దేవాలయాలకు ఇచ్చిన‌ట్లే పాఠశాలలు  ఆసుపత్రులకు విరాళాలు ఇవ్వమని కోరారు. అతి పురాత‌నంగా పేలవమైన స్థితిలో ఉన్న ఒక ఆసుపత్రిని గమనించినప్పుడు ఆవేద‌న‌తో ఈ సూచ‌న చేశారు. ఆ ఆస్ప‌త్రి ప్రఖ్యాత తంజావూర్ బృహదీశ్వర ఆలయానికి ఎదురుగా ఉంది. ర‌చ్చాసి (రాక్ష‌సి) సినిమా షూటింగ్ సందర్భంగా జ్యోతిక ఆ దేవాల‌యం వ‌ద్ద‌ షూటింగులో పాల్గొన్న‌ప్పుడు గ‌మ‌నించిన అంశాన్ని తెర‌పైకి తెచ్చారు. జ్యోతిక డేరింగ్ కామెంట్ విన్న ఓ క‌లెక్ట‌ర్ దానిని తూ.చ త‌ప్ప‌క ఆచ‌రించాల‌ని ఆదేశాల్ని జారీ చేయ‌డం ఇటీవ‌ల సంచ‌ల‌న‌మైంది. అయితే జ్యోతిక ప్ర‌శ్న‌ను కొంద‌రు హిందూ వాదులు సాంప్ర‌దాయ వాదులు తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఆ కామెంట్ వ‌ల్ల‌ హిందూ దేవ‌త‌ల‌కు అవ‌మానంగా భావించారు.

కొంద‌రు హిందూవాదులు రంగంలోకి దిగ‌డంతో అది కాస్తా పెద్ద వివాదంగా మారింది.  గాయత్రి రఘురం- ఎస్.వి. వంటి ప్రముఖ సెల‌బ్రిటీలు జ్యోతికను తీవ్రంగా విమ‌ర్శించ‌డంతో దానిపై ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. అయితే కొంద‌రు సెల‌బ్రిటీలు జ్యోతిక‌కు స‌పోర్టుగా నిలిచారు. శేఖర్ -ఎస్.ఆర్. ప్రభు- రాజశేఖ‌ర్ పాండియన్ జ్యోతిక ప్రకటనకు మద్దతునిచ్చారు. తాజాగా జ్యోతిక భర్త.. స్టార్ హీరో సూర్య తన భార్య‌కు మ‌ద్ధ‌తునిస్తూ ఓ బ‌హిరంగ ప్రకటన విడుదల చేశారు. త‌మ‌ కుటుంబం జ్యోతిక‌తోనే ఉందని చెప్పారు. దేవాలయాల మాదిరిగానే పాఠశాలలు ఆసుపత్రులకు అధిక గౌరవం ఇవ్వమని జ్యోతిక ప్రజలను కోరారని సూర్య అన్నారు. వివేకానంద ఇతర ఆధ్యాత్మిక గురువుల సూచనను ప్రస్తావిస్తూ.. మనకు దేవుడి ప్ర‌వ‌చ‌నాలు ఎంత ముఖ్య‌మో.. ఆధ్యాత్మిక గురువుల ప్ర‌వ‌చ‌నా‌లు ప్రజలకు అంతే ఉప‌యుక్త‌మైన‌వని తెలిపారు. అలాంటి ఆలోచనలను వినని వారికి ఇది తెలియదని సూర్య‌ అన్నారు. జ్యోతిక ప్రకటనను నేరంగా భావించే వాళ్ల‌ను సూర్య తప్పుప‌ట్టారు. జ్యోతిక‌ అభిప్రాయంతో అతని కుటుంబం పూర్తిగా ఏకీభ‌వించి అండ‌గా నిలుస్తుందని నొక్కి చెప్పారు. అంతేకాకుండా.. చాలా మంది తమ ఇమేజ్ ‌ను అపఖ్యాతిపాలు చేస్తున్నవారిని గుర్తించి వ్య‌తిరేకిస్తున్న అభిమానుల‌కు.. మద్దతుదారులకు త‌న కృతజ్ఞతలు తెలిపారు.

ఇక జ్యోతిక న‌టించిన ఓ చిత్రాన్ని క‌ర‌నా లాక్ డౌన్ కార‌ణంగా త‌లెత్తిన ప‌రిణామాలతో డిజిట‌ల్ రిలీజ్ చేసేందుకు సూర్య ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాను న‌టించిన సినిమాల్ని ఇక‌పై డిజిట‌ల్ రిలీజ్ చేయాల‌ని సూర్య భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎగ్జిబిట‌ర్ అసోసియేష‌న్ల నుంచి వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్నారు. అయితే డిజిట‌ల్-ఓటీటీ రిలీజ్ ఆలోచ‌న‌కు త‌మిళ నిర్మాత‌ల మండ‌లి అండ‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News