రెండు మూడు సంవత్సరాల వరకు స్టార్ హీరోలు ఎక్కువ శాతం ఒక సినిమా తర్వాత ఒకటి అన్నట్లుగా సినిమాలు చేస్తూ వచ్చారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. 1980..90 ల్లో హీరోలు ఎలా అయితే ఎక్కువ సినిమాలు చేశారో అలాగే తాము కూడా చేయాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రేంజ్ లో కాకున్నా ఏడాదికి కనీసం రెండు మూడు వీలైతే నాలుగు సినిమాలు అన్నట్లుగా ప్లాన్ చేసుకుంటున్నారు. అభిమానులు మాత్రం నాలుగు కాకున్నా కనీసం రెండు మూడు సినిమాలు ఏడాదికి విడుదల చేస్తే చాలా హ్యాపీ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తమిళం మరియు తెలుగు హీరోలు పలువురు ఒకే సారి రెండు మూడు సినిమాలు కమిట్ అవుతున్నారు. అందులో భాగంగానే తమిళ స్టార్ హీరో సూర్య కూడా ప్రస్తుతం అయిదు ప్రాజెక్ట్ లను కన్ఫర్మ్ చేశాడు.
ఆకాశమే నీ హద్దురా సినిమాతో సూపర్ హిట్ ను దక్కించుకున్న సూర్య ఒక వైపు ఆ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. రీమేక్ కు సూర్య నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఆ సినిమాలో హీరోగా నటిస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఒక వైపు ఆ రీమేక్ కు నిర్మాతగా వ్యవహరిస్తూనే మరో వైపు నాలుగు సినిమాలు ఒక వెబ్ సిరీస్ ను చేస్తున్నాడు. ఆకాశమే నీ హద్దు సినిమా తర్వాత సైలెంట్ గా ఉన్న సూర్య ఇంకా ఎప్పుడు సినిమా అనౌన్స్ చేస్తాడని ఎదురు చూస్తూ ఉండగా ఆయన బర్త్ డే సందర్బంగా ఏకంగా మూడు కొత్త సినిమాలకు సంబంధించిన టైటిల్స్ ను రివీల్ చేశాడు. అన్ని సినిమాలు కూడా తెలుగు లో కూడా విడుదల చేయబోతున్నట్లుగా ముందే ప్రకటించారు.
సూర్య జై భీమ్.. ఎతార్కుమ్ తుండివన్.. వడివసాల్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సూర్య ఆ తర్వాత మణిరత్నం ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ నవరస లో కూడా కనిపించబోతున్నాడు. ఇక ఈయన చాలా రోజులుగా ఒక తెలుగు సినిమా చేస్తానంటూ చెబుతూ వచ్చాడు. అన్నట్లుగానే ఇటీవల ఒక తెలుగు సినిమాకు సైన్ చేశాడని.. వచ్చే ఏడాదిలో ఆ సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు. తెలుగు మరియు తమిళంలో ఒకేసారి రూపొందబోతున్న ఈ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలా ఒకేసారి సూర్య తన అయిదు సినిమాలను ప్రకటించి ఇతర స్టార్ హీరోలకు పోటీ అన్నట్లుగా నిలిచాడు.
సూర్య మాదిరిగానే తమ అభిమాన హీరోలు కూడా వరుసగా సినిమాలు చేయాలంటూ ఇతర హీరోల అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా స్టార్ హీరోలు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసే రోజులు వస్తాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ఈ ఏడాది ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు సూర్య రావచ్చు. ఇక నవరస అతి త్వరలోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.