అక్కినేని కుర్రాడి సినిమా కదిలింది

Update: 2015-10-11 01:30 GMT
కాళిదాసు - కరెంట్ - అడ్డా లాంటి సినిమాలతో హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్. మూడు కూడా సొంత బేనర్లో చేసిన సినిమాలే. కానీ ఏదీ కూడా ఆశించినంతగా ఆడలేదు. మంచి బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినా మూడు సినిమాల తర్వాత కూడా హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. సొంత బేనర్ లోనే మళ్లీ సినిమా చేయాల్సిన పరిస్థితి. ఆ సొంత బేనర్ లో చేయడానికి కూడా రెండేళ్లకు పైగా ఎదురు చూడాల్సిన పరిస్థితి. కథలు, డైరెక్టర్లు కుదరక చాలా కాలం నుంచి కొత్త సినిమా మొదలుపెట్టడానికి ఎదురు చూస్తున్నాడు సుశాంత్.

ఐతే ఎట్టకేలకు అతడి నాలుగో సినిమా పట్టాలెక్కుతోంది. కామెడీ సినిమాల డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలోనే తన తర్వాతి సినిమా చేయబోతున్నాడు సుశాంత్. నాగేశ్వరరెడ్డితో సినిమా ఎప్పుడో మొదలవ్వాల్సింది. ఐతే ముందు ఓ కథ అనుకున్నాక ఎందుకో సినిమాను ఆపేశారు. మధ్యలో ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ఫేమ్ మేర్లపాక మురళి లైన్ లోకి వచ్చాడు. కానీ ఆ సినిమా కూడా పట్టాలెక్కలేదు. మురళి.. శర్వానంద్ తో సినిమా మొదలుపెట్టాడు. ఐతే ఇప్పుడు మళ్లీ నాగేశ్వరరెడ్డి లైన్ లోకి వచ్చాడు. ఓ కొత్త కథతో సుశాంత్ కథానాయకుడిగా సినిమా మొదలుపెడుతున్నాడట. తమిళ డబ్బింగ్ మూవీ ‘పాండవుల్లో ఒకడు’లో హీరోయిన్ గా నటించిన సోనమ్ బజ్వా ఈ సినిమాలో కథానాయికగా నటించనుంది. సుశాంత్ తల్లి నాగ సుశీల, చింతలపూడి శ్రీనివాసరావు ‘శ్రీ నాగ్ కార్పొరేషన్’ పతాకం మీదే ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
Tags:    

Similar News