త్వరలో సుశాంత్ సింగ్ పేరిట ఫౌండేషన్ ప్రారంభం..

Update: 2020-06-28 03:30 GMT
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నెల 14న తన ఇంట్లోనే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటంతో ఎన్నో అనుమానాలకు దారితీసింది. కెరీర్ పరంగా ఎంతో భవిష్యత్ ఉన్న సుశాంత్ ఇలా సూసైడ్ చేసుకోవడం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. సుశాంత్ చనిపోయినపుడు అతని ఇంట్లో సూసైడ్ నోట్ లేకపోవడం.. పైగా ఎలాంటి ఆధారాలు కూడా లభించకపోవడంతో ఈ ఘటన ఎన్నో చర్చలను లేవనెత్తింది. సుశాంత్ డెత్ మిస్టరీ పై సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు ప్రచారం జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో 'గుడ్ బై సుశాంత్' అంటూ.. సుశాంత్ కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫౌండేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు.

"ఈ ఫౌండేషన్ ద్వారా సినిమా.. సైన్స్.. క్రీడలకు సంబంధించి త‌దిత‌ర రంగాలలో ప్ర‌తిభ‌ కనబరిచే యువ‌త‌కు ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు. అంతేగాక బీహార్‌లోని పాట్నాలో ఉన్న సుశాంత్ చిన్ననాటి ఇంటిని ఆయన స్మారక చిహ్నంగా మార్చనున్నట్లు ఆ స్టేట్‌మెంట్ ద్వారా వెల్లడించారు. అంతేగాక సుశాంత్ వ్యక్తిగత వస్తువులతో పాటు అతను చదివిన పుస్తకాలు మొదలైనవి.. అన్నీ ఆ ఇంటిలో భద్రపరుస్తామని తెలిపారు. అలాగే సుశాంత్ సోషల్ మీడియా ఖాతాలైన ఇన్‌స్టాగ్రామ్.. ట్విట్టర్.. ఫేస్‌బుక్ పేజీలను కూడా తామే నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ స‌‌భ్యులు ఈ సందర్భంగా వెల్లడించారు. సుశాంత్ జ్ఞాపకాలు సజీవంగా ఉండాలనే ఆలోచనతో ఈ ఖాతాలను నిర్వహించనున్నామని" వారు ప్రకటించారు. ఇక సుశాంత్ ఫ్యామిలీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు స్వాగతిస్తున్నారు.
Tags:    

Similar News