స్టార్ హీరో డ్రీమ్స్ లిస్టు పెద్దదే

Update: 2019-09-14 07:21 GMT
భారతీయులకు ప్రియమైన వ్యక్తి అబ్దుల్ కలాం గారు పదే పదే చెప్పిన ఒక విషయం ఏంటంటే 'కలలు కనండి'.  అదేంటో కానీ ఎక్కువ మంది జనాలు దీన్ని నమ్మనే నమ్మరు.  కలామ్ గారు సూపర్ అని.. అయిన ఆలోచనలు అద్భుతం అని.. అయన జీవితం ఆదర్శం అని ఆయనపై ప్రశంసలు కురిపిస్తారు కానీ ఆయన చెప్పిన మాట మాత్రం ఫాలో కావడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అయితే బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ విషయంలో కలాం గారిని.. అయన ఇచ్చిన పిలుపును ఫాలో అవ్వాలని కంకణం కట్టుకున్నట్టుగా ఉన్నాడు.

తాజాగా సుశాంత్ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టాడు.  "మై 50 డ్రీమ్స్ & కౌంటింగ్"(నా యాభై కలలు..ఇంకా ఉన్నాయి) అనే క్యాప్షన్ తో తన కలల లిస్టు ఒకటి స్వయంగా తన దస్తూరితో రాసి ఆ పేపర్లను ఫోటో తీసి షేర్ చేశాడు. ఆ లిస్టులో జస్ట్ శాంపిల్ ను ఒక్కసారి చూడండి.

1. విమానం ఎలా నడపాలో నేర్చుకోవడం
2. ఐరన్ మ్యాన్ ట్రయాథ్లాన్ కోసం ట్రైనింగ్ తీసుకోవడం
3. ఎడమ చేతితో క్రికెట్ మ్యాచ్ ఆడడం
4. మోర్స్ కోడ్ నేర్చుకోవడం
5. స్పేస్ గురించి పిల్లలకు నేర్పించడం
6. ఒక ఛాంపియన్ తో టెన్నిస్ ఆడడం
7. ఫోర్ క్లాప్ పుషప్ చేయడం..

ఇలా మొత్తం యాభై కలల లిస్టును ప్రకటించాడు.  ఈ పోస్ట్ కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ లిస్టులో లాంబోర్గిని కారును సొంతం చేసుకోవడం.. యూరోప్ అంతా రైలులో ప్రయాణించడం.. ఎఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) ఎక్స్ పొనెన్షియల్ టెక్నాలజీస్ లో భాగస్వామి కావడం లాంటి డిఫరెంట్ కలలు ఉన్నాయి.  ఇప్పుడు చెప్పండి. కలాం గారి ఫిలాసఫీ ఫాలో అయ్యే వ్యక్తి లాగే కనిపిస్తున్నాడు కదా? మొత్తం లిస్టు కోసం సుశాంత్ ఇన్స్టా ఖాతా పై ఒక లుక్కేయండి.

ఇక విమర్శించేవారు.. ఇవి జన్మలో జరగవు అనేవారు ఉంటారు కదా వారి సంగతేంటి? వారు కూడా ఓ 50 కలల లిస్టు రాసుకోవచ్చు.  ఎవరిని విమర్శించాలి. ఎవరిని ట్రోల్ చేయాలి.  సబ్జెక్ట్ తెలీకుండా ఎలా బురద చల్లాలి.. ఇలా.   లేకపోతే "రోజుకు ముప్పై మర్డర్ న్యూసులు చదవాలి"..  "గంటలో ఇరవై మిస్ లీడింగ్ థంబ్ నెయిల్స్ క్లిక్ చెయ్యాలి".. "పది ఫేక్ వార్తలను వెతికి చదివి వాటిని గుడ్డిగా నమ్మాలి".  ఇలా ఎవరికి తోచింది వారు డ్రీమ్ గా పెట్టుకోవచ్చు.  ఏమీ లేకుండా పప్పుగా మిగిలేకంటే ఇలా ఉన్నా మేలే!
Tags:    

Similar News