#DRUGS కి స‌హ‌క‌రించ‌ని కొత్తవారిని బాలీవుడ్ నుంచి వెలేస్తారు!

Update: 2020-09-23 13:00 GMT
టాలెంట్ మేనేజ్ ‌మెంట్ ఏజెన్సీ KWAN కార్యకలాపాలను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితుడు.. నటుడు యువరాజ్ ఎస్ సింగ్ బహిర్గతం చేశారని తెలుస్తోంది. పీఆర్ ఏజెన్సీ నటీనటులను ఎలా దోపిడీ చేసిందో వారిని మాదకద్రవ్యాల వ్యాపారంలో పాలుపంచుకునేలా చేసి ఎలాంటి ఆట‌లు ఆడిందో వెల్ల‌డించార‌ని జాతీయ మీడియా క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి.

KWAN వంటి టాలెంట్ ఏజెన్సీలు ఎలా పనిచేస్తున్నాయో దిగ్భ్రాంతికరమైన వివరాలను అత‌డు వెల్లడించారు. బాలీవుడ్ ‌లో కొత్తగా వచ్చిన వారు మాదకద్రవ్యాల వ్యాపారంలోకి నెట్టబడ‌తారని .. వారు నిరాకరిస్తే టాలెంట్ ఏజెన్సీలు బహిష్కరిస్తున్నాయని పేర్కొన్నారు.

యువరాజ్ ప్ర‌ముఖ మీడియా నెట్‌వర్క్ తో మాట్లాడుతూ.. KWAN CEO ధ్రువ్ పదేళ్లుగా తనకు తెలుసునని KWAN తో సంబంధం ఉన్న A- లిస్టర్లలో ఎక్కువ మంది డ్రగ్స్ లో మునిగి ఉన్నారని పేర్కొన్నారు. ఇంకా సుశాంత్ స్నేహితుడు టాలెంట్ మేనేజర్లతో డ్రగ్ సిండికేట్ కు సంబంధాలు ఉన్నాయని తెలిపాడు. ఇంకా ఇందులో చాలా పెద్ద త‌ల‌కాయ‌లు (బాలీవుడ్ పేర్లు) ఇందులో ఉన్నాయని.. జయ సాహా ఒక ఏజెంట్ మాత్రమేనని చెప్పాడు. ఏజెన్సీలు స్టార్ల‌ను ఉపయోగిస్తాయి.. వారు సహకరించకపోతే పరిశ్ర‌మ నుంచి బహిష్కరించాల‌ని చెబుతార‌ని అత‌డు వెల్ల‌డించిన‌ట్టు స‌మాచారం.

క్వాన్ దిల్లీలో స్థాపించారు. అనిల్ బాన్ దాని వ్యవస్థాపక సభ్యులు. వారు సినిమాల్లో కూడా లేరు. సంస్థ ప్రారంభమైనప్పటి నుండి నాకు తెలుసు. ముఖ్యంగా నేను ధ్రువ్ కు చాలా కాలం నుండి తెలుసు. 10 సంవత్సరాలుగా వారి వ్యాపారం చాలా అభివృద్ధి చెందింది. వారు చాలా పెద్ద స్టార్ల‌తో క‌లిసి ప‌ని చేస్తారు. డీల్స్ కు సంతకం చేశారు. పరిశ్రమలో వారి ట్రాక్ రికార్డ్ అంత‌ మంచిది కాదు. ఎప్పుడూ కొన్ని చెల్లింపుల‌కు సంబంధించిన‌ సమస్యలు ఉన్నాయి. నేను వారి కార్యాలయాన్ని చాలాసార్లు సందర్శించాను`` అని యువరాజ్ చెప్పారు. ఇక క్వాన్ లాంటి సంస్థ‌లు సుశాంత్ సింగ్ లాంటి వారిని ఈ ఉచ్చులో ఇరికించి ఆడుకున్నాయ‌ని యువరాజ్ చెప్పిన‌ట్టుగా జాతీయ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.
Tags:    

Similar News