బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య యావత్ సినీ లోకాన్ని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. 34 ఏళ్ళ వయసులోనే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ లోకాన్ని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం అందర్నీ కలచి వేస్తోంది. సుశాంత్ మరణవార్త విన్న ఆయన అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు. సినీ రాజకీయ ప్రముఖులు సుశాంత్ మరణానికి సంతాపం తెలుగుతున్నారు. కాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 1986 జనవరి 21న పాట్నాలో జన్మించాడు. స్కూల్ డేస్ నుండే చదువుల్లో చురుకుగా ఉండే సుశాంత్ AIEEE లో 7వ ర్యాంక్ సాధించడమే కాకుండా 11 నేషనల్ ఇంజినీరింగ్ ఎగ్జామ్స్ క్లియర్ చేసాడు. ఢిల్లీ టెక్నాలజీ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సుశాంత్ ఫిజిక్స్ లో నేషనల్ ఒలంపియాడ్ విన్నర్ గా నిలిచాడు.
ఇక 2008లో సుశాంత్ సింగ్ 'కిస్ దేశ్ మే హై మేరా దిల్' అనే బాలాజీ టెలీఫిల్మ్స్ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యారు. ఆ సీరియల్ మంచి విజయం సాధించడంతో సుశాంత్ సింగ్ ఒక్కసారిగా స్మాల్ స్క్రీన్ పై క్రేజీ స్టార్ గా మారిపోయాడు. ఆ తరువాత 'పవిత్ర రిస్తా' అనే మరో సీరియల్ లో నటించి బుల్లితెర ప్రేక్షకుల అభిమాన హీరోగా మారిపోయాడు. దీంతో 'కై పో చెయ్' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుతుపెట్టారు. నటుడిగా, డ్యాన్సర్ గా, టెలివిజన్ పర్సనాలిటీగా గుర్తింపు తెచ్చుకున్నారు సుశాంత్. 'శుద్ధ్ దేశీ రొమాన్స్' సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. 'పీకే' 'డిటెక్టీవ్ బ్యోమకేష్ భక్షీ' సినిమాలతో బాలీవుడ్ లో స్థిరపడిపోయారు.
ఇక మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ 'ఎంఎస్ ధోని - ది అన్ టోల్డ్ స్టోరీ' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటివరకు బాలీవుడ్ కే పరిచయమైన సుశాంత్ కు ఈ సినిమా దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 'కేదారనాథ్' 'సొంచీరియా' 'చిచ్చోరె' 'డ్రైవ్' సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. సుశాంత్ చివరగా నటించిన 'దిల్ బేచారా' సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. సుశాంత్ 'తూనీగా తూనీగ' హీరోయిన్ రేహా చక్రవర్తితో చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నాడని మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా హీరోయిన్ కృతి సనన్ తో కూడా డేటింగ్ చేసాడని వార్తల్లో నిలిచారు. కాగా సుశాంత్ మరణవార్త విని సోషల్ మీడియా ద్వారా రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.