#సుశాంత్ ద‌ర్యాప్తు.. బీహార్ పోలీస్ పై ముంబై పోలీస్ గుస్సా!

Update: 2020-08-01 06:10 GMT
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆక‌స్మిక మ‌ర‌ణం పోలీసుల కంటికి కునుకు లేకుండా చేస్తోంది. ఘ‌ట‌న జ‌రిగి నెల పైగానే అయినా ఇంకా వారికి కంటిపై నిద్ర అన్న‌దే లేదు. నిరంత‌రం ద‌ర్యాప్తు పేరుతో ఎవ‌రో ఒక‌రిని క‌ల‌వ‌డం వాంగ్మూలం తీసుకోవ‌డం ఇలా ఇప్ప‌టికే 30 మందికి పైగా విచారించారు.

ఆ క్ర‌మంలోనే ఈ కేసులో చిక్కు ముడులెన్నో ఊపిరాడ‌నివ్వ‌డం లేదు. ఓవైపు నెటిజ‌నుల నుంచి స‌హ‌చ‌ర స్టార్ల నుంచి సుశాంత్ సింగ్ కి అత‌డి కుటుంబానికి మ‌ద్ధ‌తు పెరుగుతుంటే ఈ కేసును పోలీసులు సీరియ‌స్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవ‌లే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తొలి ప్రేయ‌సి.. సీరియ‌ల్ న‌టి అంకితా లోఖండేను విచారించడానికి వెళ్లిన బీహార్ పోలీసుల‌కు విచిత్ర‌మైన ప‌రిస్థితి ఎదురైంది. పోలీస్ బృందం ఏకంగా మూడు కిలోమీట‌ర్లు కాలి న‌డ‌క‌న వెళ్లాల్సి రావ‌డ‌మే గాక‌.. విచార‌ణ అనంత‌రం తిరుగు ప్ర‌యాణంలో నటి నివాసం నుంచి ఆమె లగ్జరీ కారులో వెళ్లాల్సి వ‌చ్చింద‌ట‌. ఎందుక‌ని అలా జ‌రిగింది? అంటే.. మలాడ్ ‌లోని అంకిత నివాసం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఎక్క‌డా ఆటో రిక్షా కానీ కార్ స‌ర్వీస్ కానీ అందుబాటులో లేవు‌. దాంతో ఆమె స్వ‌యంగా ల‌గ్జ‌రీ జాగ్వార్ కార్ ఇచ్చి పంపించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా రోడ్లపై ఏ స‌ర్వీస్ లేక‌పోవ‌డం పోలీసుల్ని ఇబ్బందు‌ల‌కు గురి చేసింది.

అంతేకాదు బీహార్ పోలీసు బృందానికి ముంబై పోలీసుల నుండి ఎటువంటి వాహన సహాయం అంద‌లేదని తెలుస్తోంది. అందువల్లనే బీహార్ పోలీసులు అంకిత నివాసానికి మూడు కిలోమీటర్లు నడవాల్సి వ‌చ్చింద‌ట‌. ఆమె ఇంటికి చేరుకున్నాక‌... విచారణ సుమారు గంటసేపు కొనసాగింది. ఆ తర్వాత నటి తన జాగ్వార్ ను పోలీసులకు ఇచ్చింది. అంకిత‌ను ఏకంగా 30 ప్ర‌శ్న‌లు అడిగార‌ని తెలుస్తోంది. వాటికి ఎలాంటి స‌మాధానాలు చెప్పింది అన్న‌ది తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News