బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో రోజులు గడిచే కొద్దీ అనేక కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సుశాంత్ సింగ్ సూసైడ్ కేసుపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. బీహార్ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నివేదిక ప్రకారం రియాతో పాటు ఆమె తల్లిదండ్రులు ఇంద్రజిత్ చక్రవర్తి - సంధ్య చక్రవర్తి మరియు సోదరుడు షోవిక్ చక్రవర్తిలపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. వీరితో పాటు ఈ కేసుతో సంబంధమున్నట్టుగా భావిస్తున్న శామ్యూల్ మరియు శ్రుతి మోదీల పై కూడా సీబీఐ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. అయితే ఇప్పటి వరకు సుశాంత్ మరణానికి రియా మరియు ఆమె ఫ్యామిలీ మెంబర్స్ బాధ్యులు అనే విధంగా కథనాలు వెలువడుతుండగా.. నిన్న సీబీఐ ఎఫ్.ఐ.ఆర్ తో శ్రుతి మోదీ అనే వ్యక్తి తెరపైకి వచ్చింది. అప్పటి నుంచి శ్రుతి మోదీ ఎవరు? సుశాంత్ కేసుకు ఆమెకు సంబంధం ఏంటి? ఆమె పేరు ఎఫ్.ఐ.ఆర్ లో ఎందుకు చేర్చారు అని అందరూ ఆలోచించడం స్టార్ట్ చేసారు.
కాగా శ్రుతి మోదీ.. సుశాంత్ సింగ్ మరియు రియా చక్రవర్తికి చాలా క్లోజ్ అని తెలుస్తోంది. శ్రుతి మోదీ పేరుతో ఉన్న ఇంస్టాగ్రామ్ ఖాతాని సుశాంత్ మరియు రియా ఇద్దరూ ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో రియా చక్రవర్తితో పాటు షోవిక్ చక్రవర్తికి శ్రుతి మోదీ ఒకప్పుడు మేనేజర్ గా వ్యవహరించిందని నేషనల్ మీడియా ఛానల్స్ వెల్లడించాయి. అంతేకాకుండా సుశాంత్ బిజినెస్ వ్యవహారాలు కూడా చూసుకునేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సుశాంత్ మరణించిన తర్వాత శ్రుతిని కూడా ముంబై పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. ఆమె పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం సుశాంత్ తో కలిసి గతేడాది జూలై నుండి 2020 ఫిబ్రవరి వరకు బిజినెస్ వ్యవహారాలు చేసుకున్నట్లు జాతీయ మీడియా ఛానల్స్ తెలిపాయి. అంతేకాకుండా సుశాంత్ నెల ఖర్చులు కూడా ఎక్కువగా ఉండేవని.. సుమారు 10 లక్షల వరకు మెయింటనెన్స్ ఖర్చు ఉండేదని చెప్పుకొచ్చిందట. ఇక సుశాంత్ బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడం.. రియాకి క్లోజ్ గా ఉండటం వల్లే శ్రుతి మోదీపై కూడా సుశాంత్ తండ్రి కేకే సింగ్ అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.