బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ దిశ సలియాన్ డెడ్‌బాడీని నగ్నంగా గుర్తించినట్లుగా ప్రచారం జరిగింది. దీనిని ముంబై పోలీసులు ఖండించారు. అవన్నీ ఫేక్ వార్తలు అని డిప్యూటీ కమిషనర్ విశాల్ ఠాకూర్ స్పష్టం చేశారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారని, ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనే పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. దిశ తన చివరి ఫోన్ కాల్‌ను స్నేహితురాలికి చేసినట్లు తెలిపారు. దిశ చివరి కాల్ సుశాంత్‌కు వెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ స్నేహితురాలికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
జూన్ 8వ తేదీన రాత్రి మలాద్‌లోని ఓ భవంతి పై నుండి దూకి దిశ ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఐదు రోజులకు సుశాంత్ ముంబైలోని తన నివాసంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనలు బాలీవుడ్‌లో తీవ్రకలకలం రేపాయి. ఇవి వేర్వేరు ఘటనలు అని, కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారనే విమర్శలూ ఉన్నాయి.
తమ కూతురు విషయంలో మీడియా ఇష్టారీతిన ప్రచారం చేయవద్దని, మీడియాకు ప్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నట్లే, తమకు కూడా ప్రైవసీ హక్కు ఉందని, మా జీవితాల్లోకి తొంగిచూడవద్దని దిశ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. పోలీసులు అన్నీ నిజాయితీగా చేస్తున్నారని, తమ కూతురు విషయంలో కొన్ని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. తమను అపఖ్యాతిపాలు చేయాలని చూడవద్దన్నారు.