బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. దీనిపై ముంబై పోలీసులు దర్యాప్తు జరపగా కేసు ఎటూ తేలకపోవడంపై విమర్శలు వచ్చాయి. దీంతో కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది.
ప్రస్తుతం సుశాంత్ ది హత్య అన్న కోణంలో సీబీఐ విచారణ చేస్తోంది. ఈ క్రమంలోనే ముంబై పోలీసుల వెర్షన్ ను సీబీఐ కోరినట్టుగా తెలుస్తోంది. తాజాగా సుశాంత్ మరణించిన రోజు సీన్ ను సీబీఐ అధికారు రీకన్ స్ట్రక్షన్ చేస్తున్నట్టు తెలిసింది.
సుశాంత్ ఫ్యామిలీ తమకు హత్య, కుట్ర అన్న కోణంలో ఫిర్యాదు చేయలేదని.. అందుకే ఆత్మహత్యగానే చిత్రీకరించామని ముంబై పోలీసులు సీబీఐకి చెప్పినట్టు సమాచారం. సుశాంత్ రూములో పరిస్థితులు చూసి అతి ఆత్మహత్యగా తాము నిర్ధారించామని ముంబై పోలీసులు తెలిపారు.
తమ విచారణలో తేలిన అంశాల ద్వారా ఆత్మహత్యనే అని నిర్ధారణకు వచ్చినట్టు ముంబై పోలీసులు చెప్పినట్టు తెలిసింది. ఈ కేసులో సీబీఐకి పూర్తి సహకారం అందిస్తామని చెప్పినట్టు సమాచారం.