నిజ జీవితంలో ఒక్క రూపాయి ఆస్తిని కూడా మహాత్మ గాంధీ సంపాదించలేదు కాని.. వెండితెరపై ఆయన జీవితాన్ని ఆవిష్కరిస్తూ తీసిన సినిమా కోసం హాలీవుడ్ నటుడు బెన్ కింగ్ స్లే బాగానే పుచ్చుకున్నాడు. అలాగే బాక్సర్ మేరీ కోం తన జీవితంలో గెలిచిన టోర్నీల డబ్బంతా కలిపినా కూడా.. ఆమె క్రీడా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన సినిమాలో మేరీ కోం పాత్రను పోషించిన ప్రియాంక చోప్రా రెమ్యూనరేషన్ అంత ఉండదేమో. మహామహుల జీవితాల గురించి సినిమాలు తీసి క్యాష్ చేసుకోవడం అని దీనిని అంటారు.
ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు ఇండియా అంతటా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏంటంటే.. ఖచ్చితంగా అది భారత క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్.ధోని ఆత్మకథే. త్వరలో విడుదల కానున్న ''M.S.Dhoni: An Untold Story'' సినిమాలో హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. అయితే ఈ పాత్రను చేయడానికి సుశాంత్ కేవలం 2 కోట్లు పారితోషకం తీసుకోగా.. అసలు తనపై సినిమా తీయడానికి ఒప్పుకుని ఏకంగా 45 కోట్లు తీసుకున్నాడట కెప్టెన్ ధోని. బ్రాండింగ్ లో తనకు తానే సాటి అయినే ఈ ఏటి మేటి కెప్టెన్.. ఇలా తనపై తీసే సినిమా కోసం స్టోరీ పరంగా తానే చాలా ఇన్ పుట్స్ ఇస్తూ.. భారీగా తన పాకెట్లో వేసుకున్నాడు. మొత్తానికి బయోపిక్స్ విషయంలో ఇలా రివర్సులో దోచుకున్న ఐకాన్ ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా మనం ధోని పేరే చెప్పాలి మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/