మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ లో కూడా నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఈమె తెలుగులో నాగార్జునకు జోడీగా 'రక్షకుడు' చిత్రంలో నటించింది. నటిగా ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న సుష్మిత జీవితంలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాల గురించి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో సుష్మిత తన 2014 పరిస్థితి గురించి షాకింగ్ విషయాలను వెళ్లడించింది.
2014వ సంవత్సరంలో సుష్మిత తీవ్ర అనారోగ్యం బారిన పడింది. ఆమె ఆరోగ్యం కుదుట పడటం అసాధ్యం అంటూ వైధ్యులు తేల్చి చెప్పారట. శరీరంలో ఉండే ఒక కీలకమైన అడ్రినల్ గ్రంధి పని చేయక పోవడంతో సుష్మిత సేన్ తరచు కళ్లు తిరిగి పడిపోతూ ఉండేది. ఆమె బతకడం అసాధ్యం అనుకున్న సమయంలో వైధ్యులు ఆమెకు స్టెరాయిడ్స్ ఎక్కించాలని నిర్ణయించుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ ను ప్రతి రోజు ఎనిమిది గంటలకు ఒకసారి చొప్పున ఎక్కిస్తూనే ఉండాలి.
అలా రెండు సంవత్సరాల పాటు స్టెరాయిండ్స్ ఎక్కించుకోవడం వల్ల సుష్మిత సేన్ ఆరోగ్యం కుదట పడింది. అయితే స్టెరాయిడ్స్ కారణంగా ఆమె విపరీతమైన బరువు పెరగడంతో పాటు, అంద విహీనంగా తయారయ్యిందట. దాంతో ఆమె రెండేళ్ల పాటు బయట ప్రపంచంకు కనిపించకుండా విదేశాల్లోనే ఉండి పోయింది. విదేశాల నుండి ఈమె పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి వచ్చిందట. ప్రస్తుతంకు సినిమాల్లో నటించడం లేదని, పిల్లల పెంపక విషయంలోనే తాను బిజీగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న సుష్మిత సేన్ వారి బాగోగులు చూసుకుంటూ గడిపేస్తోంది.