మహానాయకుడి ఆగమనం గందరగోళం

Update: 2019-01-26 05:49 GMT
బాలకృష్ణ, క్రిష్‌ ల కాంబినేషన్‌ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి తారక రామారావు బయోపిక్‌ 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేక పోయింది. విమర్శకుల నుండి, ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ టాక్‌ ను దక్కించుకున్నా కూడా కలెక్షన్స్‌ మాత్రం రాకపోవడంతో రెండవ పార్ట్‌ 'మహానాయకుడు' చిత్రం విడుదల విషయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ డిస్ట్రిబ్యూటర్లు మరియు నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

'ఎన్టీఆర్‌ కథానాయకుడు' విడుదల సమయంలో మహానాయకుడు చిత్రాన్ని ఫిబ్రవరి 8న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. రెండు సినిమాలకు నెల రోజుల గ్యాప్‌ ఉండకుండా మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. అయితే కథానాయకుడు ఫలితం మర్చి పోయిన తర్వాత మహానాయకుడు చిత్రాన్ని తీసుకు రావాలని క్రిష్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే మార్చి లో ఎన్నికల నోటిఫికేషన్‌ రాబోతున్న నేపథ్యంలో అంతకు ముందే సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఫిబ్రవరి చివరికి సినిమాను ఫిక్స్‌ చేశారట.

ఫిబ్రవరి 8 నుండి ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21 లేదా 22కు వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. షూటింగ్‌ పార్ట్‌ పూర్తి కాకపోవడంతో పాటు, మొదటి పార్ట్‌ లో జరిగిన తప్పులు రెండవ పార్ట్‌ లో లేకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో క్రిష్‌ కాస్త మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. రెండవ పార్ట్‌ విడుదల తేదీని ఫిబ్రవరి మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఫిబ్రవరి చివరి వారం అంటే పరీక్షల సీజన్‌ అవ్వడంతో కలెక్షన్స్‌ ఆశించిన స్థాయిలో వస్తాయా అనేది కొందరి అనుమానం. పరీక్షలు - ఎన్నికల మద్యలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఎన్టీఆర్‌ మహానాయకుడు విడుదల ఉండబోతుంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News