VD14: అసలు పని మొదలైంది!
విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ‘VD 14’ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ‘VD 14’ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధం కానున్న ఈ మూవీ కథాంశం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ జోనర్ లో ఉండబోతోంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ లో రిపబ్లిక్ డే పురస్కరించుకొని ‘VD 14’ మూవీసెట్ వర్క్ కి సంబందించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి ఇటుక వేశారు. సినిమాలో కీలకమైన ఎపిసోడ్స్ కోసం భారీ సెట్ ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లోనే మూవీ షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది.
‘శ్యామ్ సింగరాయ్’ లాంటి సక్సెస్ తర్వాత రాహుల్ సాంకృత్యాన్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని ఈ మూవీ చేస్తున్నారు. హిస్టోరికల్ ఎలిమెంట్స్ బేస్ చేసుకొని ఫిక్షనల్ కథాంశంతో ఈ చిత్రాన్ని రాహుల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పీరియాడికల్ కథలు చెప్పడంతో రాహుల్ తన స్టామినాని ‘శ్యామ్ సింగరాయ్’ తోనే ప్రూవ్ చేసుకున్నారు.
ఇదిలా ఉంటే ‘VD 14’ మూవీ ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ కలిసి చేస్తోన్న రెండో సినిమా కావడం విశేషం. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా చేయనుంది. ఇది విజయ్, రష్మిక కాంబోలో రాబోతున్న మూడో సినిమా. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే హాలీవుడ్ యాక్టర్ ని పా ఇంపార్టెంట్ రోల్ కోసం ఎంపిక చేశారనే ప్రచారం నడుస్తోంది.
ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. దీని తర్వాత రాహుల్ సాంకృత్యాన్ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథాంశం ఉంటుందని తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ నుంచి బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెట్టారు. గౌతమ్ తో చేస్తున్న మూవీ ఏప్రిల్ లో రానున్నట్లు ఎనౌన్స్ చేశారు. మరి ముందు అనుకున్న డేట్ కే సినిమా రిలీజ్ చేస్తారా లేదంటే వాయిదా వేస్తారా అనేది చూడాలి.