ఈమె కల్కి హీరోయిన్ అంటే నమ్ముతారా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో గత పదేళ్ల కాలంలో టాప్‌లో ఉంటున్న హీరోయిన్ దీపికా పదుకునే.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో గత పదేళ్ల కాలంలో టాప్‌లో ఉంటున్న హీరోయిన్ దీపికా పదుకునే. బాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేయడం మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా పేరు దక్కించుకున్న దీపికా పదుకునే గత ఏడాది టాలీవుడ్‌లో రూపొందిన ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో సెకండ్ పార్ట్‌లో దీపికా పాత్ర ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. దీపికా సినిమాలో గర్భవతిగా కనిపించింది. సినిమా విడుదల సమయంలోనూ ఆమె నిజంగానే గర్భవతి అనే విషయం తెల్సిందే.
కల్కి సినిమా ప్రమోషన్ సమయంలోనే కాస్త బరువు ఎక్కువ అనిపించిన దీపికా పదుకనే ఈ మధ్య కాలంలో చాలా మారినట్లుగా అనిపించింది. ఇటీవల ఒక ఫ్యాషన్ వీక్ షోలో పాల్గొన్న దీపికా పదుకునే విభిన్నమౌన ఔట్ ఫిట్‌లో కనిపించింది. పూర్తిగా వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో విభిన్నమైన మేకోవర్‌తో, ఓల్డ్ హెయిర్ స్టైల్‌తో దీపికా కనిపించింది. ఆమె లిప్‌స్టిక్ మొదలుకని ప్రతి ఒక్క విషయం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. క్లోజప్‌లో మాత్రమే ఈమె దీపికా పదుకునే అని గుర్తు పట్టే విధంగా ఉంది. గతంలో ఈమె ఫోటోలతో పోల్చితే ఈ ఫోటోల్లో చాలా తేడాగా ఉందని స్వయంగా ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
సాధారణంగా ఆడవారు డెలివరీ తర్వాత ఫిజికల్‌గా కాస్త మారుతూ ఉంటారు. కొందరు హీరోయిన్స్ వెంటనే పూర్వపు లుక్‌కి వస్తారు. కానీ కొందరు మాత్రం ఎక్కువ సమయం తీసుకుని నార్మల్ లుక్‌కి వస్తారు. దీపిక పదుకునే డెలివరీ తర్వాత ఫిజిక్ పరంగా మారింది. ఇన్ని రోజులు బయట కనిపించని దీపికా తాజాగా ఇలా ఒక షో లో కనిపించడంతో అందరు సర్‌ప్రైజ్ అయ్యారు. దానికి తోడు ఆమె ధరించిన ఔట్ ఫిట్ ఆమెను మరింత ఎక్కువ బరువు ఉన్నట్లు చూపించింది. అంతే కాకుండా ఆమె మేకోవర్ ఓల్డ్ హీరోయిన్ రేఖను గుర్తు చేసే విధంగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరో పదేళ్లు దీపికా పదుకునే స్టార్ హీరోయిన్‌గా ఉంటుందని భావించిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
ప్రెగ్నెన్సీ వల్ల సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినట్లు పేర్కొంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకు చిన్నప్పుడు తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ప్రేమ అయితే అందిందో ఆ ప్రేమను నా బిడ్డకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందుకే సినిమాలకు కాస్త దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ గ్యాప్‌లో ఆమె ఫిజిక్ పరంగా నార్మల్ లుక్‌కి వస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో కల్కి సినిమా షూటింగ్ పునః ప్రారంభం కాబోతుంది. కనుక అప్పటి వరకు దీపికా లుక్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి ఈమె కల్కి హీరోయిన్ అంటే గుర్తు పట్టడం కాస్త కష్టంగానే ఉంది కదా..!