స్టార్ హీరోల భార్యలు ఈ మధ్య బాగానే చక్రం తిప్పేస్తున్నారు. భర్తకున్న పేరు ప్రఖ్యాతులను వాడుకుని బాగానే కూడ బెట్టేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కి మాజీ భార్యగా సుసానే ఖాన్ అందరికీ తెలుసు. హృతిక్ వైఫ్ గా సుసానే ఉన్నపుడే రకరకాల వ్యాపారాలు చేసేసింది. ఆంట్రప్రెన్యూర్ గా, డిజైనర్ గా ఈమెకు బోలెడంత అనుభవం కూడా ఉంది. ఈమెపై ఇప్పుడు గోవాలో చీటింగ్ కేసు నమోదైంది.
ఎంజీ ప్రాపర్టీస్ అనే సంస్థకు సుసానే టోపీ వేసిందన్నది ఆరోపణ. తనను తాను ఆర్కిటెక్ట్ గా పరిచయం చేసుకున్న సుసానే ఖాన్ కు.. మూడేళ్ల క్రితం 1.87 కోట్లు ముట్టెచెప్పిందట ఆ కంపెనీ. అయితే.. అనుకున్న టైంలో వర్క్ ఇవ్వడంలో సుసానే కంప్లీట్ గా ఫెయిల్ అయ్యిందని.. అలాగే ఆమె చేసినంత వరకు ప్రాజెక్టును పరిశీలించినా.. ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్ అనిపించడం లేదని.. ఆ కంపెనీ చెబుతోంది.
సుసానేపై కేసు నమోదు చేసేందుకు మొదట పోలీసులు అంగీకరించకపోవడంతో.. ఎంజీప్రాపర్టీస్ కోర్టును ఆశ్రయించింది. అయితే.. ఈ కేసు తీవ్రత గమనించిన పోలీసులు.. ఎట్టకేలకు స్టార్ హీరో గారి మాజీ భార్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.