ఇటీవలి కాలంలో యూట్యూబ్ రికార్డులు అంటూ కొత్త రచ్చ మొదలైంది. స్టార్ హీరోలకు బలప్రదర్శన వేదికలుగా యూట్యూబ్ - సామాజిక మాధ్యమాలు నిలుస్తున్నాయన్న ఆసక్తికర చర్చకు ఇది తావిస్తోంది. కోట్లకు కోట్లు లైక్ లు - క్లిక్కులు పడితేనే స్టార్ హీరోకి అంత ఫాలోయింగ్ ఉందని ఫిక్సవ్వాల్సి ఉంటుందా? అందులో నిజాయితీ ఎంత? కూలి పేమెంట్ ఎంత? అన్న సందేహాలు వెంటాడుతున్నాయి కామన్ జనాల్లో.
అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ - మెగాస్టార్ చిరంజీవి - కండలహీరో సల్మాన్ ఖాన్- అమీర్- షారూక్ త్రయం - సూపర్ స్టార్ రజనీకాంత్ - పవన్ కల్యాణ్ - మహేష్ లాంటి స్టార్లకు ఒరిజినల్ గానే భారీ ఫాలోయింగ్ ఉన్న మాట వాస్తవం. అయితే 60 కోట్ల (600 మిలియన్) వ్యూస్ - 30 కోట్ల (300 మిలియన్ వ్యూస్) అంటూ లెక్కలు చెబితేనే రకరకాలుగా సందేహాలు కలుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. సల్మాన్ ఖాన్- కత్రిన కైఫ్ ల `స్వాగ్ సే స్వాగత్` ఇప్పటికి యూట్యూబ్ లో ఏకంగా 60 కోట్ల వ్యూస్ ని అందుకుంది. ఇదో రికార్డ్ అంటూ ప్రచారం సాగుతోంది. `టైగర్ జిందా హై` గత డిసెంబర్ లో రిలీజై బ్లాక్ బస్టర్ కొట్టింది. స్వాగ్‌సే స్వాగత్ సాంగ్ ఈ సినిమాకి ప్రమోషనల్ గా పెద్ద ప్లస్. కనీసం ఏడాది పూర్తవ్వకుండానే ఈ సినిమాలోని పాటకు ఇన్ని హిట్స్ వచ్చాయా? అంటే అది సల్మాన్ పవర్ అని ఫిక్సవ్వాల్సిందే. స్వాగ్ సే స్వాగత్ లో కత్రిన ఊప్స్ ఈ రీచ్ కి సాయపడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇకపోతే ఇదివరకూ బన్ని `సరైనోడు` హిందీ వెర్షన్ మూవీని యూట్యూబ్ లో రిలీజ్ చేసినప్పుడు వేగంగా రికార్డులు అందుకుంది. దానిని మ్యానిప్యులేట్ చేశారంటూ చాలానే రచ్చయ్యింది. బన్నికి భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా నమ్మబుల్ గా లేదని విమర్శించారంతా. రీసెంటుగానే మెగాస్టార్ చిరంజీవి `సైరా - నరసింహారెడ్డి` టీజర్ - అలానే సూపర్ స్టార్ రజనీకాంత్ `2.ఓ` టీజర్ రిలీజ్ వేళ ఇవి రికార్డులు తిరగరాస్తూ ఆన్ లైన్ సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోయాయి. వీటి విషయంలో మాత్రం ఎలాంటి నెగెటివ్ కామెంట్స్ రాలేదు. వాస్తవికంగానే ఆ ఇద్దరు స్టార్ల రేంజు అలా ఉందని ఫిక్సయ్యారు. తాజాగా ఇలయదళపతి విజయ్ నటించిన మెర్సల్ పాటలు 35కోట్లు( 350 మిలియన్) వ్యూస్ తో దూసుకుపోయాయి. కోలీవుడ్ పవర్ స్టార్ గా పేరున్న విజయ్ కి నిజంగానే అంత స్టామినా ఉందన్న చర్చా నిరంతరం సాగుతూనే ఉంటుంది. అయితే విజయ్ ఫ్యాన్స్ కూడా పలుమార్లు బలప్రదర్శనకు దిగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇక నెక్ట్స్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `సైరా` ట్రైలర్ - ఆడియోకు యూట్యూబ్ - సామాజిక మాధ్యమాల్లో మిలియన్ ట్రిలియన్ వ్యూస్ తో దూసుకుపోయే సామర్థ్యం ఉంటుందనడంలో సందేహం లేదు. అంత ఫోర్స్ మెగా ఫ్యాన్స్ కు ఉంది.. అయితే బలవంతంగా ఫోర్స్ చూపించకుండా వాస్తవికంగా ఆదరణ చూపిస్తే దానిని ప్రామాణికంగా తీసుకోవచ్చేమో?
Full View