ప్రపంచం మొత్తం కూడా కరోనా కారణంగా చిగురుటాకు మాదిరిగా వణికి పోతుంది. ప్రాణ భయం తక్కువే అని వైధ్యులు మొత్తుకుని చెబుతున్నా కూడా జనాలు మాత్రం భయంతో వణికి పోతున్నారు. 80కి పైగా దేశాలకు పాకిన కరోనా వైరస్ అంతా ఒక డ్రామా అని.. దాన్ని కావాలని అమెరికానో లేదంటే మరేదో దేశమో పుట్టించింది అంటూ వింత వ్యాఖ్యలు చేసింది తెలుగు యాంకర్ శ్వేతా రెడ్డి. ఈమె చేస్తున్న వాదన వింటే ఆశ్చర్యంగా అనుమానంగా ఉండటంతో పాటు నవ్వు కూడా వస్తుంది.
కరోనా వైరస్ కు మోడీకి జత కట్టి ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మీమ్స్ కు కారణం అవుతున్నాయి. తాజాగా శ్వేతా రెడ్డి ఈ విషయమై మాట్లాడుతూ.. ఎక్కడ చూసినా కూడా కరోనా గురించే మాట్లాడుకుంటున్నారు. కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే ఇది కార్పోరేట్ మోసం అని క్లీయర్ గా అర్థం అవుతుంది. ధ్రువ మరియు రాజుగారి గది చిత్రాల మాదిరిగానే కరోనా వైరస్ ను పుట్టించి దానికి మందు కనిపెట్టినట్లుగా బిల్డప్ లు ఇచ్చి వేల కోట్ల వ్యాపారాలు చేసుకోవాలని కొన్ని కార్పోరేట్ కంపెనీలు.. దేశాలు భావిస్తున్నాయి అంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.
ప్రపంచ పటంలో భారత్ ను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషి చూసి ఓర్వలేక ఎవరో కావాలని భారత్ ను వెనక్కు నెట్టే ఉద్దేశ్యంతో కరోనాను పుట్టించారంటూ విడ్డూరంగా వ్యాఖ్యలు చేసింది. ట్రిపుల్ తలాక్.. ఆర్టికల్ 370.. అయోద్య కేసు ఇలాంటి వాటిని ఈజీగా సాల్వ్ చేసిన మోడీ ప్రస్తుతం పౌరసత్వ బిల్లుపై దృష్టి పెడుతున్న సమయంలో ఇలా జరగడం చూస్తుంటే ఇదేదో కక్ష పూరిత కుట్ర అనిపిస్తుందని శ్వేతా రెడ్డి వ్యాఖ్యలు చేసింది. ఈ వైరస్ వల్ల దేశంలో జరుగుతున్న పలు కార్యక్రమాలు.. అభివృద్ది పనులు ఆగిపోతున్నాయి. ఇదే వారికి కావాల్సిందని మోడీపై కక్షతో ఎవరో ఇలా చేస్తున్నారంది. శ్వేతా రెడ్డి వ్యాఖ్యలపై నెటిజన్స్ ఒక రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు.