ఒకప్పుడు అగ్ర హీరో సినిమా చూడాలంటే రెండు గంటల ముందే థియేటర్ ముందు పెద్ద క్యూ కట్టే పరిస్థితి. అయినా టిక్కెట్ దొరుకుతుందన్న గ్యారెంటీ ఉండేది కాదు. చొక్కాలు చించుకుని.. దెబ్బలు తిని గాయాలతో క్యూ నుంచి బయటపడాల్సి వచ్చేది. కానీ నేడు ఆ సన్నివేశం లేదు. అందుబాటులోకి వచ్చిన ఆన్ లైన్ టెక్నాలిజీతో ఆ తిప్పలు తప్పాయి. సినిమాకెళ్లాలంటే ఇంట్లో కూర్చొని టిక్కెట్ ఆన్ లైన్ లో టిక్కెట్ బుక్ చేసుకుంటే చాలు కాస్త తొందగరా. ఫ్యామిలీతో సినిమా హ్యాపీగా చూసేయోచ్చు. ఈ విధానంతో బ్లాక్ దందా కూకుటి వేళ్లతో సమూలంగా నాశనమైంది.
ప్రస్తుతం మార్కెట్ లో రకరకాల యాప్ లు అందుబాటులో ఉన్నా ఎక్కువగా అందరూ వినియోగించేది మాత్రం బుక్ మై షోనే. సినిమా టిక్కెట్లతో పాటు.. ఇతర కార్యక్రమాలకు టిక్కెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఒక్క బుక్ మై షో మాత్రమే కల్పిస్తోంది. తాజాగా 2019 ఏడాదిలో వరల్డ్ వైడ్ గా బుక్ మైషోలోనే ఎక్కువగా టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అందులో టాప్ -5 టాలీవుడ్ సినిమాలు ఇవీ అంటూ తాజాగా బుక్ మై షో యాజమాన్యం రివీల్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి నెంబర్ -1 స్థానంలో నిలించింది. రెండవ స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన `సాహో` దక్కించుకుంది.
సూపర్ స్టార్ మహేష్ నటించిన `మహర్షి` మూడవ స్థానంలో.. విక్టరీ వెంకటేష్- మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించిన మల్టీస్టారర్ `ఎఫ్-4` నాల్గవ స్థానంలో ఉన్నాయి. చివరిగా టాప్-5 లోయువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సతీమణి సమంతతో కలిసి నటించిన మజిలీ నిలించింది. ఇక టాప్ -10 లో ఇండియా నుంచి అవెంజర్స్- ఎండ్ గేమ్ మొదటి స్థానంలో ఉండగా.. రెండవ స్థానంలో యూరి: ద సర్జికల్ స్ట్రైక్స్ అమ్మకాలలో రెండవ స్థానంలో నిలిచాయి.