మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని ఎక్కడ కూడా రాజీ పడకుండా దర్శకుడు సురేందర్ రెడ్డి భారీగా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే జార్జియాలో ఈ చిత్రంకు సంబంధించిన యుద్ద సన్నివేశాలు మరియు కీలకమైన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. తాజాగా ఈ చిత్రం ఛారిత్రాత్మక నగరం అయిన మైసూర్ లో చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
చిత్రంకు సంబంధించిన కొన్ని కీలకమైన స్వాతంత్య్ర ఉద్యమ సన్నివేశాలను మైసూర్ లో చిత్రంలోని కీలక నటీనటులతో నిర్వహించబోతున్నారు. మైసూర్ షెడ్యూల్ కు సంబంధించిన ఏర్పాట్లలో దర్శకుడు సురేందర్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్ లో చిత్రీకరించబోతున్నారు. సినిమాలో కీలకమైన యుద్ద సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసిన దర్శకుడు టాకీ పార్ట్ మరియు పాటల చిత్రీకరణ జరపాల్సి ఉందని అంటున్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా కీలక పాత్రల్లో అమితాబచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు, తమన్నా ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు. మొన్నటి వరకు వచ్చే సమ్మర్ లో సినిమా విడుదల చేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు అంతా కూడా ఈ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.