ఝుమ్మంది నాదం సినిమా అనగానే గుర్తుకు వచ్చేది డైరెక్టర్ కాదు హీరో కాదు. అందరికి ఒకటే గుర్తుకువస్తుంది. రింగులు జుత్తు సుందరి తాప్సీ. తెలుగు తమిళ్ సినిమాలలో బాగానే సినిమాలు చేసినా క్రేజ్ ఉన్న హీరోయిన్ లా మాత్రం మారలేకపోయింది. తెలుగులో ఆఫర్లు తగ్గుతున్న టైమ్ లో బాలీవుడ్ కి వెళ్ళి ప్రయత్నాలు సాగించింది. ఆ ప్రయత్నంలోనే ‘పింక్’ ‘బేబీ’ ‘నామ్ షబానా’ సినిమాలులలో నటించింది. కాకపోతే ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో రాఘవేంద్ర రావు పైన సౌత్ సినిమా రొమాన్స్ పైన కామెంట్ చేసి ఇక్కడ సినిమా అభిమానులను హర్ట్ చేసింది. దానికి ఈ సుందరి తీవ్ర విమర్శలే ఎదుర్కొంది. దానికి క్షమాపణలు చెప్పుకొని ఒక వివరణ కూడా ఇచ్చింది. మళ్ళీ తన వివరణను మరింత స్పష్టంగా ఇస్తోందిలా.
''ఆడవాళ్ళ శరీరం పై తెలుగులోనే కాదు బాలీవుడ్ సినిమాల్లో కూడా అలాంటి స్థిరభావాలు ఉన్నాయి. చాలా పాటలలో వాళ్ళ శరీరాలను అలానే చూపించి హిట్ అయిన పాటలూ ఉన్నాయి. అమ్మాయిల బాడీ అంటే ఎగబడి చూసే వాళ్ళూ చాలా మందే ఉన్నారు. నేను కూడా సౌత్ సినిమాలలో అటువంటి పాత్రలు చాలానే చేశాను. కాకపోతే బాలీవుడ్ లో ఇంకా అటువంటి కమర్షియల్ సినిమాలు చేయలేదు. నా అనుభవం తెలుగులోనే కాబట్టి ఆ ఉదాహరణ ఇచ్చాను కానీ ఎవరిని తక్కువ చేసి మాట్లాడి అనే ఉద్దేశ్యంతో అయితే కాదు'' అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ. పువ్వులు - పండులు అయిపోయాయి ఇప్పుడు కొత్తదనం కోసం బొడ్డు పై కొత్తవి వేస్తున్నారు అన్నాను. నేను కూడా అదే అన్న మీరే నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నారు. అయన స్టార్ డైరెక్టర్ పైగా నన్ను తెరకు పరిచయం చేసిన రాఘవేంద్ర రావు గారి పై నేను ఎందుకు అలా అంటాను చెప్పండి అంటూ నవ్వుతూ అడిగేసింది. మన సోషల్ మీడియాలో నెగిటివిటీ బాగా పెరిగిపోయింది బాబు కానీ దిగులుపడిపోతుంది తాప్సీ.
''నేను నా క్షమాపణ అందరికి అందాలి అని కూడా నేను అనుకోవటంలేదు ఎందుకంటే ఇదంతా గేమ్ లో ఒక భాగం. నేను ఆశ జీవిని సగం నిండిన గ్లాస్ నీళ్ళను ఎలా చూడాలో నాకు తెలుసు. సగం లేవు అని ఎప్పుడూ బాధపడను. ఉన్న సగాన్ని ఎలా వాడాలో ఆలోచిస్తాను'' అని సందేశం ఇచ్చింది తాప్సీ. వరుణ్ ధావన్ ‘జూడ్వా2’ లో నటిస్తున్న తాప్సీ ఇప్పుడు బాలీవుడ్ కమర్షియల్ సినిమాలపై దృష్టి పెట్టింది. అంటే తను కూడా ఇప్పుడు బాలీవుడ్ కమర్షియల్ హీరోయిన్ లిస్ట్ లో చేరబోతోంది అనమాట.