తాప్సి పెళ్లి ముచ్చట.. అక్కడికి చేరాలట

Update: 2021-01-20 15:08 GMT
ఈమద్య కాలంలో హీరోయిన్స్‌ మినిమం పెళ్లి వయసు 35 ఏళ్లగా మారిపోయింది. కొందరు హీరోయిన్స్‌ నాలుగు పదుల వయసు దగ్గర పడ్డా కూడా పెళ్లి గురించి ఆలోచించకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం తాప్సి వయసు 33 ఏళ్లు. అయినా కూడా ఆమె పెళ్లి గురించి తనకు ఆలోచన లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం మథియాస్ బో తో ప్రేమలో ఉన్న ఈ అమ్మడు పెళ్లి విషయంలో మాత్రం ఇప్పట్లో ఒక నిర్ణయానికి రాలేనంటూ చెప్పుకొచ్చింది. తాను అసలు పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితిల్లో లేను అంది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం కెరీర్‌ పైనేనంటూ చెప్పుకొచ్చింది.

తాను కోరుకున్న స్థాయికి వెళ్లిన సమయంలో ఆశించిన పాత్రలు అన్ని చేసిన తర్వాత అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను అంటూ తేల్చి చెప్పింది. బిజీ హీరోయిన్‌ గా ఉన్న తాప్సి పెళ్లి చేసుకుంటే అవకాశాలు తగ్గే అవకాశం ఉంది. అందుకే ఆమెకు పెళ్లి పై ఇప్పుడు ఆసక్తి లేనట్లుగా మాట్లాడుతూ ఉంది. ఎప్పుడైతే అవకాశాలు తగ్గుతాయో అప్పటి వరకు ఆమె సినిమాలు చేయాలని.. పెళ్లికి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లుగా ఆమె మాటలను బట్టి అర్థం అవుతుంది.


Tags:    

Similar News