టాలీవుడ్ ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యి, ఇక్కడ అవకాశాలు దక్కకపోవడం వల్లనో లేదా అక్కడ మంచి అవకాశాలు దొరుకుతున్నాయి అంటూ పర బాషా ఇండస్ట్రీ లలోకి జంప్ అయిపోతున్న చాలా మంది హీరోయిన్లను మనం చూస్తూనే ఉన్నాం. అందులో తెలుగే బావుంది అన్నవాళ్ళు ఉన్నారు అలానే ఆబ్బె తెలుగు వేస్ట్ అన్న వాళ్ళు ఉన్నారు.
ఝుమ్మంది నాదం తో తెలుగు పరిశ్రమ లోకి వచ్చిన తాప్సి తొలి హిట్ కొట్టింది ఇక్కడే అయినప్పటికి తెలుగు గురించి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసి మన మనసులను గాయ పరచిన మాట తెలిసిందే. దేవదాసు తో హీరోయిన్ అయిపోయిన స్లిమ్ బ్యూటీ ఇలియానా కూడా తెలుగు పలు ఇంటర్వ్యూలలో తెలుగు ప్రేక్షకుల మనసు కష్టపెట్టేలా మాటలు చెప్పింది. ఇంక హిందీ లోకి వెళ్లిన అందరూ ఇంతేనేమో అనుకుంటున్న సమయంలో మన రకుల్ వచ్చింది. హిందిలో ఎపుడో నాలుగేళ్ళ క్రితం యారియాన్ అనే సినిమాలో నటించిన ఈ చిన్నది ఇపుడు మళ్ళీ అయ్యారి అనే చిత్రం తో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.
ఆ సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్ లో తెలుగు లో చాలా హిట్లు అందుకున్నారు. యారియాన్ తర్వాత మళ్ళీ అయ్యారి తో రాబోతున్నారు. ఇకపై ఏ ఇండస్ట్రీ లో కొనసాగలి అనుకుంటున్నారు అని అడగగా, నాకు ఇండస్ట్రీ అని కాదు తెలుగు అయినా తమిళ్ అయినా హిందీ అయిన మంచి కథలు చేస్తూ వచ్చాను అలానే మంచి కథలు చేస్తూ ఉంటాను అంటూ తెలివిగా సమదనమిచ్చింది. ఇలియానా, తాప్సీ లాగా తిట్టకుండా మల్టీ టాస్కింగ్ చేస్తా అంటోంది ఈ భామ.