మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా మేకర్స్ సరిగా ప్రమోషన్స్ చేయడం లేదంటూ మెగా అభిమానులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల నయనతార - సత్యదేవ్ క్యారక్టర్ పోస్టర్స్ వదిలిన చిత్ర బృందం.. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ని విడుదల చేయడానికి రెడీ అయ్యారు.
'తార్ మార్ తక్కర్ మార్' అనే ఈ సాంగ్ ను రేపు సెప్టెంబర్ 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అంతకంటే ముందుగా నిన్న బుధవారం సాయంత్రం దీనికి సంబంధించిన ప్రీ టీజర్ ని వదిలారు. ఇండియాలోని ఇద్దరు బిగ్గెస్ట్ మెగాస్టార్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారని పేర్కొనడంతో ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు.
చిరంజీవి - సల్మాన్ ఖాన్ తొలిసారిగా కలిసి ఆడిపాడనున్న పాట కావడం.. ప్రస్తుతం ఫుల్ ఫార్మ్ లో ఉన్న ఎస్ఎస్ థమన్ కంపోజ్ చేసిన సాంగ్ కావడం.. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన పాట కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే దీని ప్రోమో తీవ్రంగా నిరాశ పరిచిందని తెలుస్తోంది.
సాంకేతిక కారణాలు సాకుగా చూపి చెప్పిన టైంకి రిలీజ్ చేయలేదని నిరాశ చెందిన ఫ్యాన్స్.. 'తార్ మార్ తక్కర్ మార్' ప్రీ టీజర్ చూసి నీరసించిపోయారు. చిన్న పిల్లల రైమ్ లో లైన్స్ తీసుకుని ఏదో వెరైటీగా ట్రై చేసిన ఈ పాట.. ఊహించిన రేంజ్ లో లేదని కామెంట్స్ చేశారు.
ఇక ఎప్పటిలాగే థమన్ ఈ సాంగ్ తో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. 'క్రాక్' లో మాస్ బిరియాని.. 'బ్రూస్ లీ' లో 'కుంఫు కుమారి'.. 'అఖండ' జై బాలయ్య పాటలను మిక్స్ చేసి 'గాడ్ ఫాదర్' కోసం 'తార్ మార్ తక్కర్ మార్' సాంగ్ కు ట్యూన్ కంపోజ్ చేశాడని తమన్ ను ట్రోల్ చేస్తున్నారు. రీమేక్ సినిమా కాబట్టి అన్నీ రీమిక్స్ చేసి కొట్టాడని కామెంట్స్ పెడుతున్నారు.
మెగాస్టార్ సినిమాకు ఫస్ట్ టైం మ్యూజిక్ అందిస్తున్నాడంటే ఓ రేంజ్ లో ఎక్సపెక్ట్ చేశామని.. కానీ ఈ ప్రోమోనే నిరాశ పరిచిందని అంటున్నారు. నిజానికి 'గాడ్ ఫాదర్' టీజర్ బీజేయమ్ కూడా ఆశించిన స్థాయిలో లేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. మరి రేపు రాబోయే తార్ మార్ ఫుల్ సాంగ్ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
కాగా, 'గాడ్ ఫాదర్' చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్' కు తెలుగు రీమేక్. హై ఇంటెన్స్ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించబోతున్నారు. సల్మాన్ ఖాన్ - నయనతార - సత్యదేవ్ - సముద్రఖని ఇతర పాత్రలు పోషించారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పెషల్ అప్పీయరన్స్ ఇవ్వనున్నారు.
'గాడ్ ఫాదర్' చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై ఆర్‌బి చౌదరి మరియు ఎన్‌వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అదే రోజున కింగ్ అక్కినేని నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' సినిమా కూడా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.