నాన్న లేకుండానే..? ట‌బు నిజ‌జీవితం ఎమోష‌నల్..!!

Update: 2022-11-05 09:30 GMT
వెట‌ర‌న్ న‌టి ట‌బు నిజ‌జీవితం అంతా ఎమోష‌న‌ల్ గా కొన‌సాగిందా? ఆమె త‌న తండ్రిని ఎన్న‌టికీ క‌లుసుకోలేదా? అంటే `అవును` అనే త‌న నుంచి స‌మాధానం. ఇది త‌న అభిమానుల‌కు ఆశ్చ‌ర్యంతో పాటు షాక్ ని క‌లిగిస్తోంది. పెద్ద తెర‌పై గొప్ప ప్ర‌తిభావంత‌మైన తార‌గా వెలిగిపోయిన ట‌బు నిజ‌జీవితంలో బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌ని ఎమోష‌న్ దాగి ఉంద‌న్న‌ది కొంద‌రికే తెలిసిన స‌త్యం.

త్రోబ్యాక్ ఇంట‌ర్వ్యూలో త‌న తండ్రి గురించి ప్ర‌శ్నించ‌గా.. ట‌బు అన్న మాటలు ఆశ్చ‌ర్య‌పరిచాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతోంది. ``నా తండ్రి ఇంటిపేరును ఉపయోగించడం నాకు ముఖ్యమని నేను ఎప్పుడూ అనుకోలేదు`` అని ట‌బు ఈ చాటింగ్ సెష‌న్ లో తెలిపారు. తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న తర్వాత తన తండ్రి గురించి తనకు ఎలాంటి జ్ఞాపకాలు లేవని ఒక పాత ఇంటర్వ్యూలో టబు వెల్లడించింది.

టబు హిందీ చిత్ర సీమ స‌హా టాలీవుడ్ లో అగ్ర నాయిక‌గా కొన‌సాగింది. ఇప్పుడు సీనియ‌ర్ న‌టీమ‌ణిగా త‌న వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌ల‌తో అల‌రిస్తోంది. బాలీవుడ్ తో పాటు సౌత్ ప్రాజెక్ట్ లతో అద్భుతమైన లీడ్ లో ఉందిప్పుడు. గొప్ప న‌ట‌న‌ అసాధారణమైన పాత్రలతో త‌న స్థాయిని మ‌రింత‌గా విస్త‌రిస్తోందే కానీ ట‌బు ఈ వ‌య‌సులోనూ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. క్లిష్ట‌త‌ర‌మైన‌ పాత్రలను పోషించడం నుండి గ్లామ‌ర్ పాత్ర‌ల వ‌ర‌కూ.. క‌మ‌ర్షియ‌ల్ సినిమా క్వీన్ గాను ట‌బు తన ప్ర‌తిభ‌తో మెప్పించింది.

ఇటీవ‌ల బాలీవుడ్ బ్లాక్ బస్టర్ భూల్ భూలయ్యా 2లో ద్విపాత్రాభినయం తో గొప్ప ప్రశంసలు ద‌క్కించుకుంది. ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన థ్రిల్లర్ `దృశ్యం` సీక్వెల్ కోసం సిద్ధమవుతోంది. ఇంత‌లోనే ట‌బు పాత ఇంటర్వ్యూలలో తన కుటుంబం గురించి ఆమె ఇంటిపేరును ఉపయోగించకపోవడానికి గల కారణాల గురించి ఓపెనైన వీడియో వైర‌ల్ అవుతోంది.

టబు తన వ్యక్తిగత జీవితం విషయంలో ఎంతో లోప్రొఫైల్ ను కొనసాగించడానికి ఇష్టపడుతుంది. తన తల్లిదండ్రుల విడాకుల గురించి సిమి గ్రెవాల్ తో రెండెజౌస్ అనే పాపుల‌ర్ చాట్ షోలో ముచ్చ‌టించింది. తన తండ్రితో తన సంబంధంపైనా ఈ చాట్ షోలో ఓపెనైంది. ఆమె తన పూర్తి పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మీని ఎందుకు ఉపయోగించలేదో వివ‌రించింది. హష్మీ తన తండ్రి ఇంటిపేరు. ``నేను దీన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు.. నా తండ్రి ఇంటిపేరును ఉపయోగించడం నాకు ముఖ్యమని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది ఎల్లప్పుడూ తబస్సుమ్ ఫాతిమా.. ఇది నా మధ్య పేరు. స్కూల్లో ఫాతిమా నా ఇంటిపేరు. నాకు అతని(నాన్న‌) జ్ఞాపకాలు లేవు. నా సోదరి అతనిని సందర్భానుసారంగా కలుసుకుంది. కానీ నేను అతనిని కలవాలని ఎప్పుడూ భావించలేదు. నేను అతని గురించి ఆసక్తిగా లేను. నేను ఎలా ఉన్నానో.. నేను పెరిగిన విధానంతోనే సంతోషంగా ఉన్నాను. నేను నా జీవితంలో చాలా స్థిరపడ్డాను`` అని ట‌బు చెప్పింది.

దృశ్యం 2లో టబు తిరిగి పోలీసు పాత్రను పోషిస్తారు. 2015లో సంఘటన జరిగిన ఏడేళ్ల తర్వాత రెండో భాగం క‌థ‌ ప్రారంభమవుతుంది. అజయ్ దేవగన్- ఇషితా దత్తా- శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా కూడా కనిపించనున్నారు. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు. నవంబర్ 18న మూవీ విడుదల కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News