బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అంధాదున్ ను తెలుగు మరియు తమిళంలో ఒకేసారి రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలుగులో నితిన్ హీరోగా అంధాదున్ రీమేక్ ను ప్రకటించారు. అంధాదున్ లో కీలక పాత్రలో టబు కనిపించింది. ఆ పాత్రకు తెలుగులో మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేయడం జరిగింది. టబు వంటి సీనియర్ హీరోయిన్ చేసిన ఆ పాత్రను తెలుగులో తమన్నా వంటి ప్రస్తుత హీరోయిన్ తో చేయించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం ఏ మేరకు సక్సెస్ అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలుగులో టబు పాత్రకు గాను తమన్నాను తీసుకుంటే తమిళ రీమేక్ కోసం మాత్రం సిమ్రాన్ ను ఆ పాత్రకు తీసుకున్నారు. సీనియర్ హీరోయిన్ పాత్ర కోసం మరో సీనియర్ హీరోయిన్ అయితేనే బ్యాలన్స్ అవుతుందనే ఉద్దేశ్యంతో తమిళ రీమేక్ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు. తమిళంలో ఈ సినిమాను జీన్స్ ఫేం ప్రశాంత్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో అక్కడ ఇక్కడ దాదాపు ఒకేసారి రీమేక్ కు సంబంధించిన చిత్రీకరణ మొదలు అయ్యే అవకాశం ఉంది. విడుదల విషయంలో అటు ఇటు అయినా కూడా వచ్చే ఏడాదిలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు రీమేక్ ల్లో నటించబోతున్న తమన్నా.. సిమ్రాన్ ల్లో ఎవరు బెస్ట్ అనేది సినిమాలు విడుదలైన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.