జక్కన్నా.. తమన్నా కూడా అదే అడుగుతోంది

Update: 2015-04-08 15:30 GMT
బాహుబలి రిలీజ్‌ ఎప్పుడు.. టాలీవుడ్‌లో ఎక్కడా చూసినా ఇదే ప్రశ్న ఇప్పుడు. అసలు బాహుబలి షూటింగ్‌ అయిందా లేదా అన్న డౌట్స్‌ కూడా క్లియర్‌ అయిపోయాయి. యూనిట్‌ సభ్యులందరూ కలిసి గుమ్మడికాయ కూడా కొట్టేశారు. ఆ మధ్య మే 15న రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నాం అని చెప్పేసి సైలెంటైపోయిన రాజమౌళి.. ఆ డేట్‌కు సినిమా రాదన్న విషయంపై ఏం మాట్లాడట్లేదు. మరోవైపు జులై విడుదల గురించి వస్తున్న వార్తల గురించి కూడా క్లారిటీ లేదు. ఐతే బయటి వాళ్లకే కాదు.. యూనిట్‌ సభ్యులకు కూడా 'బాహుబలి' విడుదల గురించి క్లారిటీ లేదన్న విషయం తమన్నా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిసొచ్చింది.

ఓ ఇంటర్వ్యూలో సరదాగా చిట్‌ చాట్‌ చేస్తూ.. మీ ముందుకు రాజమౌళి వచ్చి.. ఆయన్నో ప్రశ్న అడగాల్సి వస్తే ఏం అడుగుతారు అనంటే.. ''బాహుబలి రిలీజ్‌ డేట్‌ ఎప్పుడు అనడుగుతా'' అని బదులిచ్చింది తమ్మూ. దీన్ని బట్టి బాహుబలి రిలీజ్‌ డేట్‌ విషయంలో జనాలు ఎంత అయోమయంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారమైతే.. మేలో ఎట్టి పరిస్థితుల్లోనూ బాహుబలి విడుదలయ్యే ఛాన్సే లేదన్నది స్పష్టం. రిలీజ్‌ డేట్‌ చెప్పండి సార్‌ అంటూ ట్విట్టర్లో ఫ్యాన్స్‌ రాజమౌళి పేజీలోకొచ్చి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నా జక్కన్న మాత్రం ఔట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ అన్నట్లు సైలెంటుగా ఉన్నాడు.
Tags:    

Similar News