''నాకు ఇష్టమైన నటుడు లియోనార్డో డికాప్రియోకి బాఫ్టా అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందో చెప్పలేను. ఈ అవార్డు తనకు రావల్సిందంతే. తనపై నాకున్న ప్రేమ ఇంకా రెట్టింప్పయ్యింది'' అంటూ ఒక ట్వీటేసింది మిల్కీ బ్యూటి తమన్నా. ఈవిడ అలా చెప్పిందో లేదో.. నేను కూడా నేను కూడా అంటూ చాలామంది వంత పాడేశారు. అసలు విషయం ఏంటబ్బా?
ఏమీ లేదండీ. .అప్పుడెప్పుడో మన చిన్నప్పుడు 'టైటానిక్' సినిమాతో హీరోగా ఇండియవారి మనస్సును దోచేసిన జాక్ ఉన్నాడు చూడండి.. ఇతగాడి గురించే ఈ హడావుడి అంతా. అతడి పేరు లియోనార్డో డికాప్రియో. ఇతగాడి అభిమానులందరిదీ ఒకటే బాధ. ఏంటంటే.. మనోడు ఇప్పటికి 5 సార్లు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యాడు కాని.. ఒక్కసారి కూడా అవార్డును మాత్రం గెలుచుకోలేదు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఓసారి.. బెస్ట్ యాక్టర్ గా మూడు సార్లు.. నిర్మాతగా ఒకసారి నామినేట్ అయ్యాడు. ఇక ముచ్చటగా ఇప్పుడు 6వ సారి.. బెస్ట్ యాక్టర్ నామినేషన్ ను సాధించాడు. ''ది రెవినెంట్'' సినిమాలోని ఇతగాడు కనబరిచిన అద్భుత నటనకు గాను.. ఈ నామినేషన్ లభించింది.
ఇప్పుడు ఉత్కంఠబరితమైన విషయం ఏంటంటే.. మరి ఈసారైనా లియోనార్డో ఆస్కార్ గెలుస్తాడా? ఇప్పటికే ''ది రెవినెంట్''లోని నటనకు గాను.. ఆస్ట్రేలియా ఫిలిం అవార్డ్స్.. ఫిమేల్ జర్నలిస్ట్స్ అవార్డ్.. బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిలిం క్రిటిక్స్ అవార్డ్.. బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిలింస్ (బాఫ్టా) అవార్డ్..క్రిటిక్స్ చాయిస్ అవార్డ్.. డోరియన్ అవార్డ్.. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్.. స్ర్కీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్.. అందుకున్నాడు. దాదాపు అందరూ ఉత్తమ నటుడి పురస్కారమే అందించారు. అలాగే బోస్టన్.. డాలస్.. చికాగో.. డెన్వర్.. శాన్ డీగో.. సెయింట్ లూయిస్ గేట్వే.. వాషింగ్టన్ డిసి.. మొదలగు అమెరికన్ నగరాల క్రిటిక్స్ విడివిడిగా ఏటా ఎంపిక చేసే బెస్ట్ యాక్టర్ ట్రోఫీ కూడా మనోడికే దక్కింది.
అందుకే ఇతగాడికి తప్పకుండా ఆస్కార్ ఉత్తమ నటుడు ట్రోఫీ కూడా అందాలని అందరూ కోరుకుంటున్నారు. మనోడికి ఆస్కార్ అందితే మాత్రం.. తమన్నాకే కాదు.. అందరికీ పండగే పండగ. ఆల్ ది బెస్ట్ లియోనార్డో. ఫిబ్రవరి 28న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది.