వెనుక తరం సోకులతో మిల్కీ తళుకులు

Update: 2017-01-05 06:13 GMT
సోకులు సోయగాలతో మిల్కీ బ్యూటీ తమన్నా మెరిసిపోవడం అనేక మార్లు గమనిస్తుంటాం. ఎన్ని సార్లు చూసినా తనివి తీరని మేని మెరుపులు ఈ వయ్యారి భామ సొంతం. తను నటించే చిత్రాలలో మెరుపుల విషయాన్ని కాసేపు అలా ఉంచితే.. తన అందానికి ఎంతో మందిని దాసోహం చేసుకునే సౌందర్యం తమన్నా సొంతం.

ఈ మధ్య ఈ సుందరాంగి ప్రత్యేక ఫోటో షూట్ చేయించుకుంది. ఈ తరం యువతను ఎప్పుడో బుట్టలో వేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు పాత తరం సౌందర్య ప్రేమికులకు నేరుగానే వల వేస్తూ.. వింటేజ్ ఫోటో షూట్ తో అదరగొట్టింది. దశాబ్దాల క్రితం అందాల భామల వస్త్రధారణ ఎలా ఉంటుందో.. సోయగాల ప్రదర్శనలో వారు పాటించే మెళకువలను.. దేహ సౌందర్యం.. వస్త్రాలంకరణలనను అవపోసిన పట్టేసిందా అనిపించేట్లుగా తయారయింది తమన్నా.

రంగుల హరివిల్లును కళ్లముందు ఆరబోసినట్లుగా ఉన్న ఈ ఫోటోలు.. ఏ తరం వారినైనా మైమరింపించేయడం ఖాయమే. మా జనరేషన్ లో ఇలాంటి అద్భుత సౌందర్య రాశి ఎందుకు పుట్టలేదో అని పాపం చాలామంది సౌందర్య పిపాసకులు తెగ బాధపడిపోతున్నారట. హఠాత్తుగా ఇలాంటి వింటేజ్ ఫోటోషూట్ చేయాలని తమన్నా అంతరంగంలోకి ఆలోచన ఎందుకు వచ్చిందో? ఏ అంతరాత్మ ప్రబోధించిందో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News