తమన్నా సీన్స్ తీసేశారా?

Update: 2017-04-28 09:36 GMT
‘బాహుబలి: ది కంక్లూజన్’లో తమన్నా పాత్ర పెద్దగా ఉండదని.. అనుష్కకే ఇందులో పెద్ద పీట అని రాజమౌళి ముందు నుంచి చెబుతూ వస్తున్నాడు. కానీ తమన్నా మాత్రం ఎప్పుడు మీడియా వాళ్లు అడిగినా అలా ఏమీ కాదంటోంది. ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం రెండో భాగంలోనూ తనది కీలక పాత్ర అని చెప్పింది. ముఖ్యంగా క్లైమాక్స్ గురించి చెబుతూ.. అది తన మీదే తీశారంది. ఈ సినిమా కోసం యుద్ధ సన్నివేశాల్లో శిక్షణ పొందినట్లు.. గుర్రపుస్వారీ కూడా సాధన చేసినట్లు చెప్పింది. కానీ తెరమీద చూస్తే తమన్నా చెప్పిందానికి పూర్తి విరుద్ధంగా కనిపించింది.

అసలు ‘బాహుబలి: ది కంక్లూజన్’లో తమన్నా మహా అయితే ఓ ఐదు నిమిషాలు కనిపించి ఉంటే ఎక్కువేమో. అది కూడా తెరమీద చాలా నామమాత్రంగా కనిపించిందామె. ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా పెట్టలేదు తమన్నాకు. యుద్ధ సన్నివేశాల్లో ఆమె మీద అసలు ఫోకస్సే లేదు. దేవసేన చివర్లో అగ్నిప్రస్థం తీసుకెళ్లే సమయంలో ఆమెకు రక్షణగా వెంట వెళ్లడం మినహాయిస్తే తమన్నా నోటిస్ అయ్యేది చాలా తక్కువ. కనీసం మహేంద్ర బాహుబలితో అవంతికకు పెళ్లయినట్లయినా చూపించి ఉంటే తమన్నా అభిమానులు కొంచెమైనా సంతృప్తి చెందేవాళ్లేమో. మరి వాస్తవం ఇలా ఉంటే తమన్నా అలా ఎలా చెప్పుకుందో మరి. ఐతే తమన్నా మీద రెండో పార్ట్ లో కొన్ని సన్నివేశాలు తీసిన మాట వాస్తవమని.. ఐతే అప్పటికే లెంగ్త్ ఎక్కువైపోవడంతో వాటిని ఎడిటింగ్ లో నిర్దాక్షిణ్యంగా తీసి పక్కన పడేశారని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఎలా అయితే ఏం.. ‘బాహుబలి-2’లో తమన్నాకు అసలు రోల్ అంటూ ఏమీ లేకపోవడం ఆమె అభిమానుల్ని నిరాశకు గురి చేసేదే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News