మిల్కీబ్యూటీ తమన్నా కెరీర్ జర్నీ.. సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి తెలిసినదే. ఇటీవల ఈ బ్యూటీ వరుస ఫోటోషూట్లు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. యువతరంతో పోటీపడుతూ ఈ సీనియర్ బ్యూటీ జనం దృష్టిని తనవైపు తిప్పేసుకుంటోంది. ఆల్వేస్ షో స్టాపర్ గా నిలుస్తోంది.
మిల్కీ మోడ్రన్ లుక్ లో దర్శనమిస్తే ఫ్యాన్స్ ఫిదా అయిపోవడం గ్యారెంటీ. తాజాగా ఓ అవార్డ్ వేడుకలో సరి కొత్త ఫోటో షూట్ తో మెరుపులు మెరిపించింది. మెటాలిక్ డిజైనర్ డ్రెస్ లో తమన్నా హృదయాల్ని కొల్లగొట్టింది. సిల్వర్ కలర్ టోన్డ్ మెటాలిక్ దుస్తుల్ని ధరించిన తమన్నా కార్సెట్ బాడీ..పెన్సిల్ కట్ బాటమ్ తో ఆకర్షణీయంగా కనిపించింది. ఎత్తైన నెక్ లైన్.. షార్ట్ స్లీవ్ వేషాధారణలో చూపరులను ఆకట్టుకుంటుంది. డోల్స్ గబానా డిజైన్ చేసి దుస్తుల్లో సీ గ్రీన్..లావెండన్..పింక్..బ్ల కాంబినేషన్ డిజైన్డ్ మెటాలిక్ దుస్తులివి. స్టిలె ట్టోస్..లాంగ్ డ్రాప్ చెవిపోగులతో పూర్తిగా సరికొత్త లుక్ వ్వావ్ అనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మిల్కీబ్యూటీ అభిమానులు ఫ్రెష్ లుక్ కి ఫిదా అయిపోయారు. ఇన్ స్టా వేదికగా తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. ఈ రూపం చూశాక అవెంజర్ క్వీన్ లా ధగధగలాడుతోంది! అంటూ మిల్కీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరైతే సూపర్ గాళ్ లా కనిపిస్తోందని పొగిడేస్తున్నారు. అయితే కొందు నెటిజనుల నుంచి ఊహించని కామెంట్లు ఎదుర్కొంది. తమన్నా ఆంటీ అయిపోయిందా? అంటూ కొందరు కామెంట్లు చేసారు. 2005లో డెబ్యూ ఇచ్చిన తమన్నా వయసు 31. ఈ 16ఏళ్లలో సౌతిండస్ట్రీలో చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది. అయితే 30 ప్లస్ ఏజ్ అయినా సుదీర్ఘ కాలం కెరీర్ ని సాగించడంతో తమన్నాను అంతా ఆంటీ అంటూ కామెంట్ చేస్తున్నారనుకోవచ్చు.
ఇక తమన్నా ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `ఎఫ్-3` లో నటిస్తుంది. అలాగే `గుర్తుందా శీతాకాలం` అనే మరో చిత్రంలోనూ నటిస్తుంది. ఈ రెండు గాక మెగాస్టార్ చిరంజీవి సరసన `భోళా శంకర్` లో ఛాన్స్ అందుకుంది. `సైరా నరసింహారెడ్డి `తర్వాత చిరుతో జత కట్టడం విశేషం. ఇక బాలీవుడ్ లో `ప్లాన్ ఏ ప్లాన్ బి`...`బోలే చుడియాన్` చిత్రాల్లో నటిస్తోంది. హిందీ చిత్రసీమ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవాలని తమన్నా ఎప్పటి నుంచో కలలు కంటోంది. కానీ సరైన అవకాశాలు రాలేదు. తొలుత బాలీవుడ్ లోనే హీరోయిన్ గా లాంచ్ అయింది. కానీ అవకాశాలు రాకపోవడంతో తెలుగు చిత్రాలపై కాన్సంట్రేట్ చేసి సక్సెస్ అయింది. అటుపై కొలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. కానీ మాతృభాషలో మాత్రం నటిగా ఇంకా ఫేమస్ కాలేదు. అడపా దడపా అవకాశాలు వచ్చినా వైపల్యాలు వెనక్కి లాగుతున్నాయి.