బాహుబలి బ్యూటీ.. స్టార్ హీరోయిన్ తమన్నా తల్లిదండ్రులకు తాజాగా కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని తమన్నానే ట్విట్టర్ ఖాతాలో స్వయంగా వెల్లడించింది.
కొద్దిరోజులుగా తన తల్లిదండ్రులలో కరోనా లక్షణాలు కనపించాయని.. దీంతో తాము కరోనా టెస్టులు చేయించుకున్నట్లు తమన్నా తెలిపింది. అయితే తన తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ వచ్చిందని పేర్కొంది.
వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకున్నామని తమన్నా తెలిపింది. ఇక తాను కూడా పరీక్షలు చేయించుకున్నానని.. తనకు నెగెటివ్ వచ్చిందని వివరించింది. మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా నెగెటివ్ అంటూ పేర్కొంది. తన తల్లిదండ్రులు కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని వివరించింది.
తమన్నా ప్రస్తుతం టాలీవుడ్ లో గోపిచంద్ ‘సిటీమార్’ సినిమాలో నటిస్తోంది. సత్యదేవ్ తోనూ సినిమా ఒప్పుకుంది. కరోనా కారణంగా తల్లిదండ్రులతో తమన్నా ఉంటోంది.