టాలీవుడ్ హీరోయిన్స్ లో కొద్ది మంది మాత్రమే స్టిఫ్ గా స్టాంగ్ గా ఉంటారు. డాన్స్ విషయంలో కూడా కొందరు మాత్రమే అదరగొడుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్ లలో ముందు వరుసలో ఉండే ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ అమ్మడు ఇటీవల ఒక షూటింగ్ సందర్బంగా కరోనా బారిన పడింది. దాదాపు రెండు వారాల పాటు ఆమె క్వారెంటైన్ లో ఉంది. ఇటీవలే ఆమెకు కరోనా నెగటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. నెగటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా రెండు మూడు రోజులు క్వారెంటైన్ లోనే ఉన్న తమన్నా ఎట్టకేలకు బయటకు వచ్చేసింది.
స్నేహితులతో కలిసి వర్కౌట్స్ చేసింది. కరోనా నుండి తాను ఈజీగా బయట పడటానికి కారణం ఈ వర్కౌట్స్ అంటూ గత కొన్ని రోజులుగా పూర్తి స్థాయిలో చేయని వర్కౌట్స్ ను ఎట్టకేలకు ఆరు బయట ప్రశాంత వాతావరణంలో చేసింది. చాలా ఉల్లాసంగా తమన్నా కనిపించింది. అయితే మొహంలో మాత్రం కాస్త మార్పు వచ్చినట్లుగా అనిపించింది. ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం వల్ల మొహం కాస్త ఉబ్బి ఉంటుందని వర్కౌట్ లు వరుసగా వారం చేస్తే ఖచ్చితంగా అంతా సెట్ అవుతుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈజీగా మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా నుండి కోలుకోవడం పట్ల అభిమానులు ఆనందంగా ఉన్నారు. ఆమె మళ్లీ మునుపటి తీరుగా షూటింగ్ లు చేయడంతో పాటు ఇతర పనుల్లో కూడా బిజీ అవ్వనుంది.
Full View