19 ఏళ్ల తర్వాత సెన్షేషనల్ కాంబో రిపీట్‌

Update: 2021-08-18 13:30 GMT
తమిళ దర్శకుడు కతిర్ చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా కూడా ఎప్పటికి నిలిచి పోయే సినిమాలను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఈయన దర్శకత్వంలో వచ్చిన ప్రేమ దేశం మరియు ప్రేమికుల రోజు సినిమాలు ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాయో అందరికి తెల్సిందే. తమిళంలో రూపొందిన ఆ సినిమా లు తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అందరిని ఆకట్టుకున్నాయి. ఆ సినిమాలకు సంబంధించిన పాటలు ఇప్పటికి కూడా మారు మ్రోగి పోతూనే ఉన్నాయి అంటే ఆ సినిమాల పాటలు ఎంతగా పాపులర్ అయ్యాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కతిర్ దర్శకత్వం వహించిన మొత్తం సినిమాలు ఆరు కాగా అందులో మొదటి సినిమా మరియు చివరి సినిమా కాకుండా నాలుగు సినిమాలకు ఏఆర్ రహమాన్ సంగీతాన్ని అందించాడు. ప్రేమ దేశం మరియు ప్రేమికుల రోజు పాటలు ఏ ఆర్‌ రహమాన్ నుండి వచ్చినవే. వీరిద్దరి కాంబోలో చివరిగా 2002 లో కాదల్ వైరస్‌ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా కు కూడా మంచి స్పందన వచ్చింది. ఆ సినిమా పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కొన్ని కారణాల వల్ల సినిమాలను ఎక్కువగా తీయని కతిర్ చివరగా 2016 లో ఒక కన్నడ మూవీని చేశాడు. మళ్లీ ఇన్నాళ్ల తర్వత ఒక సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

తమిళ స్టార్ నిర్మాత ఎన్ రంగనాథన్‌ తనయుడు కిషోర్ హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు. కిషోర్‌ ను హీరోగా పరిచయం చేసే బాధ్యతను కతిర్‌ తీసుకున్నాడు. ఆర్‌కే ఇంటర్నేషనల్‌ బ్యానర్‌ లో రూపొందబోతున్న ఈసినిమా కోసం సంగీతాన్ని ఏఆర్‌ రహమాన్ అందించబోతున్నాడు. చెన్నై.. ముంబయి.. బెంగళూరుతో పాటు విదేశాల్లో కూడా చిత్రీకరించబోతున్నారు. ఈ సినిమా తర్వాత కతిర్ మళ్లీ వేగంగా సినిమాలు చేస్తాడా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కంటే ఎక్కువగా ఆ సినిమా యొక్క పాటల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కతిర్ మరియు రహమాన్ ల కాంబోలోని సినిమాలన్నీ కూడా మ్యూజికల్‌ సూపర్‌ హిట్‌ గా నిలిచాయి. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా మ్యూజికల్‌ హిట్‌ గా నిలుస్తుందని అంటున్నారు.




Tags:    

Similar News