ఎస్‌-3 పైర‌సీ ప్రింట్ పెడ‌తామ‌న్న వెబ్ సైట్‌

Update: 2017-02-06 13:18 GMT
త‌మిళ‌నాట పైర‌సీ భూతం ఏ స్థాయిలో విస్త‌రించిందో చెప్ప‌డానికి ఇది తాజా రుజువు. త‌మిళంలో కొత్త సినిమాలు రిలీజ‌వ‌డం ఆల‌స్యం. ఆ రోజు రాత్రికే కొన్ని వెబ్ సైట్లు పైర‌సీ ప్రింట్లు పెట్టేస్తుంటాయి. కానీ ఆ వెబ్ సైట్ల‌ను ఎవ్వ‌రూ ఏమీ చేయ‌లేరు. ఇదేమీ చాటు మాటు వ్య‌వ‌హారం కాదు. ఆ వెబ్ సైట్ల పేర్లు సినిమా వాళ్ల‌కు కూడా తెలుసు. కానీ ఆ వెబ్ సైట్ల ఆగ‌డాలు అలాగే సాగిపోతుంటాయి. తాజాగా ఒక టొరెంట్ వెబ్ సైట్ మ‌రీ శ్రుతి మించింది. ఈ నెల 9న విడుద‌ల‌వుతున్న సూర్య సినిమా ‘ఎస్‌-3’ పైర‌సీ వెర్ష‌న్ గురించి ఆ వెబ్ సైట్ ముందే అనౌన్స్ మెంట్ ఇవ్వ‌డం సంచ‌ల‌నం సృష్టించింది.

‘ఎస్‌-3’ విడుద‌ల రోజు ఉద‌యం 11 గంట‌ల‌కే త‌మ వెబ్ సైట్లో ఆ చిత్రం లైవ్ స్ట్రీమ్ అవుతుంద‌ని ఆ వెబ్ సైట్ ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. దీనిపై ‘ఎస్‌-3’ నిర్మాత జ్నాన‌వేల్ రాజా మండి ప‌డ్డాడు. తాను నిర్మాతల మండ‌లి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోతున్నాన‌ని.. అందులో గెలిచి ఆరు నెల‌ల్లో ఈ వెబ్ సైట్ అడ్మిన్ ను జైలుకు పంపిస్తాన‌ని జ్నాన‌వేల్ అన్నాడు. మ‌రోవైపు ఈ వెబ్ సైట్ కు వ్య‌తిరేకంగా అత‌ను మ‌ద్రాస్ హైకోర్టులో పిటిష‌న్ వేశాడు. ‘ఎస్‌-3’ సినిమా పైర‌సీ వెర్ష‌న్ పెట్టే వెబ్ సైట్ల‌ను నిషేధించాల‌ని జ్నాన‌వేల్ ఆ పిటిష‌న్లో కోర‌గా.. ఈ పిటిష‌న్ ను మ‌ద్రాస్‌ హైకోర్టు విచార‌ణ‌కే స్వీక‌రించ‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో జ్నాన‌వేల్ ఏం చేస్తాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News